Why We Are Not Indebted To Anyone :మన పూర్వీకులు, పెద్దలు ఎన్నో మంచి మాటలు చెప్పారు. బోధించారు. అందులో చాలా అర్థముంటుంది. కానీ మనకు అవి అంత సులభంగా అర్థం కావు. అలాంటి మాటల్లో ఎవరికీ రుణపడకూడదు అనే మాట ఒకటి. అసలు అలా ఎందుకు అన్నారు. అందులోని అంతరార్థం ఏమిటి ? వీటితో పాటు ధర్మం- మర్మం అంటే ఏంటి ? ధర్మాచరణలో మనం గమనించే అంశాలేమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.
ధర్మం పది లక్షణాల్ని కలిగి ఉంటుందని యాజ్ఞవక్ల్య స్మృతి చెబుతోంది. ధర్మాన్ని తెలుసుకోవడమే మర్మం. శ్రీమద్భాగవతం చిత్రకేతువు పాక్షాణంలో ఉన్న ఓ శ్లోకం ఉంది. అందులో రుణానుబంధం అంటే ఏంటి? అసలా అనుబంధం ఎందుకు ఉంటుంది? తదితర అంశాలుంటాయి.
రుణానుబంధ రూపేణా
పశు పత్నాసుతే దయః
రుణక్షయేక్షయం యాతీ
కాతత్ర పరివేదనా
చిత్రకేతువు అనే రాజుకు భార్య ఉంది. ఆమె తన సంతానాన్ని కోల్పోయి విలపిస్తుంది. ఆ సమయంలో ఆమెకు చిత్రకేతువు రాజు రుణానుంబంధ రూపేణా అంటూ ఈ శ్లోకాన్ని బోధిస్తాడు. గత జన్మలోని రుణానుబంధాల ద్వారానే మనకు భర్త, సంతానం, పశువుల లాభం కలుగుతాయి. ఎంత రుణానుబంధముందో అంతకాలమే పశువులు కానీ, భర్త కానీ, సంతానం కానీ మొదలైన వారు మనతో ఉంటారు. ఒక్కసారి ఈ రుణం తీరగానే వెళ్లిపోతారు. ఇది ఎంతకాలమో ఎవరికీ తెలియదు. ఎవరు ఎవరికి బాకీనో తెలియదు. మన సంతానమంతా మనకు బాకీదార్లే. అందుకే పెద్దలు, పిల్లల చేతిలో నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడరు.
అలాగే మంచి మాటలు చెప్పే వాళ్లు కూడా మనకు బాకీదార్లు. అలాంటి వారు మనకు మేలు చేస్తారు. కానీ ఒక్కసారి వారు దూరమైతే మళ్లీ అలాంటి వారు దొరకరు. ఇలా వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించి లాభం లేదు. వారు ఆ రుణం తీరగానే వారు వెళ్లిపోతారు. దానికోసం ఏడవటం ఎందుకు అని పెద్దలు చెబుతారు.