Which Direction is Best For Water Tank :ఏ ఇంటికి అయినా నీటి వసతి ఎంతో ప్రధానమైనది. వాస్తు శాస్త్రం ప్రాధమిక సూత్రం ప్రకారం ఇంటికి ఈశాన్యంలో నీటి బావులు, నల్లా, వాటర్ ట్యాంకులు, సంపులు వంటివి ఉండాలి. దీంతో కొంత మంది ఈశాన్యంలో నీటి కొళాయి లేదా బక్కెట్లలో నీళ్లు పెడుతుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈశాన్యంలో భూమి లోపల నీరు నిల్వ ఉండాలి. అప్పుడే ఇంటికి శ్రేయస్కరం. దీంతో పాటు ఈశాన్యంలో నీటి నిర్మాణాలు ఏర్పాటు చేసేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు గోడకు తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం మంచింది. అలాగే ఈ గుంతను సింహద్వారం, ఇంటి ప్రహరీ గోడ గేటుకు ఎదురుగా గానీ ఉండకూడదు. నల్లా కోసం కోసం ప్రహరీ గోడ గేటు వద్ద గుంత చేయడం అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంటి యజమానురాలికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే నీటి ఏర్పాట్లు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతోంది.
ఆగ్నేయం పెరిగితే ఇల్లాలికి కష్టాలు!
ప్రతి ఇంటి ఆగ్నేయ దిశ ఇల్లాలికి ప్రముఖ స్థానమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఇంటి ఆగ్నేయం పెంచకూడదు. దీని వల్ల ఇంటి యజమానురాలికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఆగ్నేయం పెరిగి ఉన్న ఇంట్లో ఉండాల్సి వస్తే అక్కడ చిన్న చుట్టు ఇల్లు వంటివి నిర్మించుకోవాలి. ఇలా చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల ఇంటి ఇల్లాలు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.