Vakri Shani In Horoscope :వరాహ మిహిరుడు రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఉద్యోగ స్థానానికి అధిపతి. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండటం, పైగా వక్రించి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం మారడానికి, కెరీర్ మార్చుకోవడానికి అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. స్వస్థానంలో శని వక్రించడం వల్ల సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా కొన్ని మార్పులు రావచ్చని పండితులు చెబుతున్నారు. శని వక్రించి ఉండడం వలన దూర ప్రాంతాల్లో వారు స్వస్థలాలకు సొంత ప్రాంతంలోని వారు దూర ప్రాంతాలకు బదిలీలు కావచ్చు. అలాగే పదోన్నతులు కూడా ఉండవచ్చు. ఏ రాశులపై ఈ ప్రభావం ఉంటుందో చూద్దాం.
ఈ రాశులకు శుభయోగం
జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకర, కుంభ రాశుల వారికి నవంబర్ 15 లోగా ఉద్యోగంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
మేషం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా మేష రాశికి ఉద్యోగ కారకుడు అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో దశమాధిపతిగా ఉన్నాడు. ఈ ప్రభావం వలన ఈ రాశి వారు తప్పకుండా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పదోన్నతికి కోసం, భారీ వేతనం కోసం ఈ రాశివారు ఉద్యోగం మారడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాలు లేదా దూర ప్రాంతం నుంచి మెరుగైన ఆఫర్ అందే సూచనలున్నాయి. చాలా కాలంగా ఒకే ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా స్థాన చలనం ఉంటుందని ఫలితాలు చెబుతున్నాయి.
వృషభం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా వృషభ రాశి వారికి దశమాధిపతి అయిన శని దశమ స్థానంలోనే వక్రించి ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. ఇతర సంస్థల నుంచి పెద్ద జీతంతో మంచి అవకాశాలను అందుకుంటారు. అలాగే దూర ప్రాంత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ సొంత ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే సూచనలున్నాయి. అలాగే ఈ రాశి వారు ఉద్యోగ భద్రత కోసం నూతన ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
సింహం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా సింహ రాశి వారికి సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. ఈ క్రమంలో సప్తమాధిపతి శని కారణంగా తప్పకుండా ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సాధారణంగా దూర ప్రాంతానికి పదోన్నతి మీద బదిలీ కావడం జరుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచీల ఏర్పాటు వంటి కారణంగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నదానికన్నా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి.