తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

జనవరి 29 "చొల్లంగి అమావాస్య" - ఈ పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుందట! - DOS AND DONTS ON CHOLLANGI AMAVASYA

-మౌని అమావాస్య రోజు చేయాల్సిన, చేయకూడని పనులివే -వివరిస్తున్న జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​

Dos and Donts on Chollangi Amavasya 2025
Dos and Donts on Chollangi Amavasya 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 4:57 PM IST

Dos and Donts on Chollangi Amavasya 2025: హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. పుష్య మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని 'చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య' అని పిలుస్తారు. ఈ నెల 29వ తేదీన చొల్లంగి అమావాస్య వచ్చింది. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. మరి ఈ అమావాస్య రోజు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చొల్లంగి అమావాస్య రోజు చేయకూడని పనులు:

  • ఈ రోజున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో నిద్ర పోకూడదని మాచిరాజు చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోవద్దని సూచిస్తున్నారు.
  • చొల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో క్షుర కర్మ చేయించుకోకూడదని అంటున్నారు. క్షుర కర్మ అంటే హెయిర్​ కటింగి, షేవింగ్​ వంటివి. అలాగే గోళ్లు కత్తిరించుకోవడం, కొరకడం వంటివి కూడా చేయొద్దని చెబుతున్నారు.
  • ఈ అమావాస్య రోజు తలంటు స్నానం చేయొద్దని, తలస్నానం చేస్తే మంచిదని అంటున్నారు. తలంటు స్నానం అంటే శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసి షాంపూ లేదా కుంకుడుకాయతో స్నానం చేయడం. తలస్నానం అంటే కేవలం తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం. ఈ రోజున తలంటు స్నానం చేయకుండా తలస్నానం చేస్తే మంచిదని అంటున్నారు.
  • చొల్లంగి అమావాస్య రోజు రాత్రి పూట భోజనం చేయకూడదని అంటున్నారు. అంటే కేవలం మధ్యాహ్నం మాత్రమే అన్నం తిని, రాత్రి కేవలం అల్పాహారం తీసుకోవాలని చెబుతున్నారు.
  • ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త దుస్తులు ధరించకూడదని చెబుతున్నారు. అలాగే వస్త్రాలకు పసుపు కూడా పెట్టకూడదని వివరిస్తున్నారు. ఈ నియమం తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.

ఏం చేస్తే మంచి జరుగుతుంది:

  • చొల్లంగి అమావాస్య రోజు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే జాతక దోషాలు మొత్తం తొలగిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు.
  • ఈరోజున ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మం దగ్గర లేదా నైరుతి మూల ఓ పరిహారం పాటిస్తే ధనలక్ష్మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. ఆ పరిహారం ఏంటంటే, ఓ గాజు గ్లాసు తీసుకుని అందులో నీళ్లు, రాళ్ల ఉప్పు వేసి కలిపాలి. ఆ తర్వాత ఆ గ్లాసును గుమ్మం దగ్గర లేదా ఇంట్లో నైరుతి దిశలో ఉంచి అమావాస్య మరునాడు ఎవరూ తొక్కని ప్రదేశంలో మొక్కలను పోయాలి. ఇలా చేస్తే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసివస్తుందని అంటున్నారు.
  • మౌని అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకున్న మంచిదని చెబుతున్నారు. మూడు పోగులు కలిగిన నల్ల దారం తీసుకుని మూడు చోట్ల ముడులు వేసి "ఓం లంలంలం ఓం లంలంలం దిష్టి నివారయామి దిష్టి నివారయామి" అనుకుంటూ ఎడమకాలికి కట్టుకోవాలి. అలా కట్టుకున్న నల్ల దారాన్ని మళ్లీ వచ్చే అమావాస్య రోజు జిల్లేడు ఆకులో కర్పూరం ఉంచి కాల్చేయాలి. ఇలా చేయడం వల్ల నరదిష్టి, శత్రుబాధలు తొలగిపోతాయని మాచిరాజు అంటున్నారు.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మాఘమాసంలో పెళ్లి చేసుకుంటే- సంతాన, సౌభాగ్యాలు, ఐష్టైశ్వర్యాలు కలగడం ఖాయం!

"కస్తూరి కాయతో ఈ చిన్న పరిహారం చేస్తే - మీ సంపద పెరిగి దశ మారిపోతుంది!"

ABOUT THE AUTHOR

...view details