తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశుల వారికి వివాహ యోగం - శ్రీ లక్ష్మీ ధ్యానం శుభకరం! - WEEKLY HOROSCOPE

2024 డిసెంబర్​ 29వ తేదీ నుంచి 2025 జనవరి 4వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 4:01 AM IST

Weekly Horoscope From December 29th, 2024 To January 4th, 2025 :ఈ 2024 డిసెంబర్​ 29వ తేదీ నుంచి 2025 జనవరి 4వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి విజయావకాశాలు మెరుగవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో రాణిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృధా ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక సమస్యలు నివారించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వైవాహిక జీవితం కూడా ఆనందంతో నిండి ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార సంస్థలు లాభాల బాటలో పయనిస్తాయి. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. విదేశీ సంస్థల పెట్టుబడులతో వ్యాపారం పుంజుకుంటుంది. గతంలోని పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. కొత్త వెంచర్, పొదుపు స్కీమ్‌కి నిధులు కేటాయించే ముందు విశ్వసనీయత పరిశీలించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అవివాహితులకు వివాహం జరుగుతుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తీరికలేని పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం కారణంగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు వారం ద్వితీయార్ధం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. లాభాల శాతం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో, వ్యక్తిగత విషయాలలో వివిధ సవాళ్లను ఎదుర్కొనవచ్చు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి కొంత ఉపశమనం లభించవచ్చు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో లక్ష్యసాధన కోసం కృషి చేస్తే విజయం ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ ప్రతిరోజూ చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో చేరాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి కోరిక ఈ వారం నెరవేరుతుంది. ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడంతో ఉపశమనం లభిస్తుంది. పని ప్రదేశంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులు మీకు ముఖ్యమైన బాధ్యతను అప్పగించవచ్చు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళతారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. గృహంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆదాయ వనరులు విస్తరిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టపడే ప్రదేశానికి మారాలనే మీ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరుతుంది. వృత్తి పరంగా కొత్త అవకాశాలకు తోసుకు వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు అందుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు కోరుకున్న చోటికి బదిలీ కావడంతో మీ దీర్ఘకాల లక్ష్యం నెరవేరుతుంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు కల నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మేలు. గిట్టని వారు వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు సృష్టించే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశతో ఉంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. దైవ బలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధిత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ప్రయాణాలు అనుకూలించవు. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారు నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్ళండి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్థాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తీవ్రమైన కృషితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే కీలకమైన నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన లక్ష్యాలను సాధించడానికి అనువైన సమయం. ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనడం ద్వారా గణనీయమైన అవకాశాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇంటికి బంధువులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు కోరుకున్న ప్రమోషన్ పొందుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మునుపెన్నడూ లేనంతగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

ABOUT THE AUTHOR

...view details