తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కాంపౌండ్ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది! - Vastu Rules For Home

Vastu Rules For House Compound Wall : కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారికి వాస్తు విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. అయితే, కొంత మందికి ఇల్లును వాస్తు ప్రకారం కట్టుకుని, కాంపౌండ్‌ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోవాలని ఉంటుంది! మరి వాస్తు ప్రకారం ప్రహరీ గోడను రౌండ్‌గా నిర్మించుకోవచ్చా? దీనిపై నిపుణుల సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం..

Vastu Rules For House
Vastu Rules For House Compound Wall (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 2:56 PM IST

Vastu Rules For House Compound Wall: హిందూ సంప్రదాయంలో వాస్తును చాలా మంది విశ్వసిస్తారు. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లోని వస్తువుల ఏర్పాటు వరకు ప్రతిదీ వాస్తు ప్రకారమే చేస్తారు. అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించి ఇంటి ప్రహరీ గోడ విషయంలో మాత్రం ఇష్ట ప్రకారం నిర్మించుకుంటారు. అంటే రౌండ్​గా, చతురస్రాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో నిర్మిస్తారు. అయితే చాలా మంది తమ ఇష్టానికి అనుగుణంగా గుండ్రంగా ప్రహరీ గోడ నిర్మించుకుంటారు. మరి వాస్తు ప్రకారం కాంపౌండ్​ వాల్​ను గుండ్రంగా నిర్మించుకోవచ్చా? అలా గుండ్రంగా నిర్మిస్తే ఏమన్నా సమస్యలు వస్తాయా? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Vastu Rules For Home :ఇల్లు ఎంత పెద్దగా కట్టుకున్నా కూడా కాంపౌండ్‌ వాల్‌ లేకపోతే కళ ఉండదు. అందుకే ఇంటిని ఎంత విస్తీర్ణంలో కట్టుకున్నా కూడా దాని చుట్టూ తప్పకుండా ప్రహరీ గోడను నిర్మిస్తారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి కాంపౌండ్‌ వాల్‌ చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంపౌండ్‌ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోకూడదని తెలియజేస్తున్నారు. ఎందుకంటే..

ఇలా గుండ్రంగా ప్రహరీ గోడను కట్టుకోవడం వల్ల ఇంట్లో అశాంతులు, ఆందోళనలు కలుగుతాయని అంటున్నారు. అలాగే కాంపౌండ్‌ వాల్‌ గుండ్రంగా ఉండటం వల్ల ఇంటి చుట్టూ వాతావరణం సుడిగుండంలా మారుతుందని పేర్కొన్నారు. కాబట్టి, ప్రహరీ గోడను వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం నిర్మించుకోవాలని సూచిస్తున్నారు.

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే! - vastu tips for home

వాస్తు ప్రకారం గేటు ఏ దిశలో ఉండాలి ?ఇంటిని నిర్మించుకున్న తర్వాత వాస్తు ప్రకారం గేటును ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి గేటును ఉత్తర-ఈశాన్యం, తూర్పు-ఈశాన్యం, దక్షిణ-ఆగ్నేయం, పడమర-వాయువ్యం వైపున ఏర్పాటు చేసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం, దక్షిణ-నైరుతి, పడమర-నైరుతి వైపున గేట్‌లను నిర్మించుకోవడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంకా గేట్లకు వేసే రంగులు వీలైనంత వరకూ నల్లగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటికి కూడా లైట్‌ కలర్‌లో ఉండే రంగులను వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

లక్ష్మీదేవికి 108 రూపాయి నాణేలతో పూజ- శుక్రవారం రోజు మహిళలు ఇలా చేస్తే కనక వర్షమే! - Ways To Attract Goddess Lakshmi

తులసి మాలను ఏ స్వామి భక్తులు ధరిస్తారు? - ఎంతటి పుణ్యం లభిస్తుందో తెలుసా? - Tulsi Mala Benefits

ABOUT THE AUTHOR

...view details