తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"ఈ పరిహారం చేస్తే - మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది!" - ASTROLOGY REMEDY FOR OWN HOUSE

సొంతింటి కల సాకారమవ్వాలంటే - ఈ పరిహారం పాటించాలంటున్న జ్యోతిష్య నిపుణులు!

ASTROLOGY REMEDY FOR New HOUSE
Astrology Remedies for getting Own House (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 6:35 PM IST

Astrology Remedies for getting Own House : ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కొన్నిసార్లైతే దగ్గర వరకు వచ్చి ఏదో ఒక అడ్డంకి చేత గృహ నిర్మాణం ప్రారంభం కాకుండానే ఆగిపోతుంటుంది. మీకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందా? అలాంటి వారు జ్యోతిశాస్త్రం ప్రకారం ఈ పరిహారాన్ని ఆచరిస్తే అంతా మంచి జరుగుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్. అంతేకాదు.. ఆ పరిహారం ఆచరించిన వారికి త్వరలోనే నూతన గృహయోగ ప్రాప్తి సిద్ధిస్తుందంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ పరిహార ప్రక్రియ? దాన్ని ఎలా ఆచరించాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గృహం అనేది పరమేశ్వరుడుప్రసాదించే అపూర్వ అనుగ్రహం. ప్రతి ఒక్కరూ ఈ అపూర్వ అనుగ్రహాన్ని పొంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్. అదేంటంటే.. మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ, నెల, వారం ఏ రోజు అయినా పర్వాలేదు. కొద్దిగా వెండిని కొని దానిని చిన్న ఇటుకమాదిరిగా తయారు చేయించుకోవాలి. తర్వాత ఆ వెండి ఇటుక ముక్కను ఇంటికి తీసుకొచ్చుకోవాలి.

అనంతరం ఇంటికి వచ్చాక స్నానమాచరించి శుభ్రంగా రెడీ అయి పూజా మందిరంలో మీరు తయారు చేయించిన వెండి ఇటుకను పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. ఆపై దీపారాధన చేసి తర్వాత లక్ష్మీదేవిఅష్టోత్తర సహస్రనామాన్ని జపించాలి. తదుపరి ఆంజనేయస్వామికి సింధూరంతో అర్చన చేసి దూపదీప, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

ఆవిధంగా పూజలు నిర్వహించాక తర్వాత రోజు ఆ వెండి ఇటుకను జేబులో లేదా మనీ పర్సులో ఒకరోజు పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు దాన్ని తీసి బీరువాలో దాచుకోవాలి. జ్యోతిష్యశాస్త్రంప్రకారం ఇలా వెండి పరిహారం పాటించడం ద్వారా.. తప్పనిసరిగా ఆ వెండి ఇటుక ప్రభావం చేత త్వరలోనే మీకు అద్వితీయమైనటువంటి గృహయోగ ప్రాప్తి కలుగుతుందని, మీ కోరిక ఫలిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు వేణుగోపాల్.

ఇలా చేసినా మంచి ఫలితం!

అంతేకాకుండా.. ప్రతి సోమవారం నాడు ఇంటి గృహిణి పరమేశ్వరుడికి జాజిపూల దండను అలంకరణగా అలంకరించి పూజ చేసి ఇలా ప్రార్థించడం మంచి ఫలితం ఉంటుందంటున్నారు. స్వామి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు నూతన గృహ యోగ ప్రాప్తిని కలిగించు అంటూ కోరుకున్నా కూడా.. కొత్త గృహ యోగం సిద్ధిస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

అదృష్టం, ఐశ్వర్యం తొందరగా కలిసి రావాలా? - మీరు జన్మించిన నెలలో ఈ పరిహారాలు చేస్తే మంచిదట!

"ఇంట్లోని ఈ ప్రదేశాల్లో 'స్వస్తిక్' గుర్తు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహాం పొంది ధనవంతులవుతారు"!!

ABOUT THE AUTHOR

...view details