Thursday Pooja Benefits In Telugu :దేవగురువు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనదని శాస్త్ర వచనం. ఒక వ్యక్తికి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్ధిక పురోగతి, సొంత ఇల్లు వంటివన్నీ కూడా గురువు అనుకూలత వల్లే కలుగుతాయి. అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం గురుపూజ ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే!
జాతకంలో గురుబలం పెంచుకోడానికి, అదృష్ట యోగం పట్టడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం, ధ్యానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చేసే పనుల్లో విజయం లభిస్తుంది.
గురువారం విష్ణు పూజతో కలిసి వచ్చే అదృష్టం
శ్రీ మహావిష్ణువు పూజకు గురువారం ఎంతో శ్రేష్టమైనది. అందుకే శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం అనుకూలత పొందడానికి పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణునికి పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పవిత్రమైన మనసుతో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు సమకూరుతాయి.
స్నానం చేసే నీటిలో ఇది వేస్తే ఐశ్వర్యప్రాప్తి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లైతే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు పొందడానికి, జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచించిన ఈ పరిహారం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, ఆనందం, అదృష్టం కలుగుతాయని విశ్వాసం.