Thursday Devi Pooja In Telugu :వృత్తివ్యాపారాల్లో రాణించాలని అనుకుంటున్నారా? విద్యార్థులు ఉన్నత విద్యలు చదవాలని చూస్తున్నారా? పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారా? వీటితో పాటు జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలకు మన శాస్త్రాలు ఎలాంటి సమాధానం ఇస్తున్నాయో ఈ ఆర్టికల్లో చూద్దాం.
ఈ రోజుల్లో దేవి దర్శనంతో తొలగిపోయే ఆటంకాలు
బుధ, గురువారాల్లో రాజరాజేశ్వరి దేవి, లలితా దేవి, దుర్గాదేవి, గాయత్రి దేవి వంటి దేవతల దర్శనంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. సకల కార్య జయం కలుగుతుంది. దీంతో పాటు శ్రీరాములవారి చిత్రపటం ఇంట్లో ఉంటే మిత్రుల నుంచి అన్ని పనుల్లో సహకారం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
ఇలా చేసినట్లయితే ఎనలేని పుణ్యం, చక్కని ఆరోగ్యం!
సాయంకాలం సమయంలో దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద తొమ్మిది వత్తులతో దీపారాధన చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది. కోరిన కోరికలు తీరుతాయి. ఈ కార్యక్రమం ఏ దేవాలయంలో అయినా చేయవచ్చు. శుభకార్యాలు కోసం ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ చివరకు శారీరక సహాయం అయినా సరే చేసినట్లయితే అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.
గురుసేవతో అనాయాస మరణం
వృద్ధ్యాప్యంలో ఉన్న గురువులకు సేవ చేసినట్లయితే పుణ్యంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతారు. ఇలా చేసిన వారికి అంతిమ సమయంలో ఎవరిచేత కూడా సేవలు చేయించుకోకుండా అనాయాస మరణం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది.
ఉన్నత స్థాయి కోసం విద్యార్థులు ఇలా చేయాల్సిందే!
విద్యార్థులు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు ముళ్లు లేని మొక్కలకు నీళ్లు పోస్తే విద్యలో చక్కగా రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పెద్దలు చెబుతున్నారు.