Sri Rama Navami 2024 Wishes and Quotes in Telugu: ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నాడు రాములోరి పండగను జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఈ పర్వదినాన మీ బంధువులకు, స్నేహితులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సాధారణంగా కాకుండా.. ఇలా స్పెషల్గా చెప్పండి!
Sri Rama Navami 2024 Wishes in Telugu:
- శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీ కుటుంబంలో సర్వదోషాలు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.!!
- శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!
- పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు..!!
- ఈ శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను.. ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..!!
- శ్రీరామనవమి.. మీకు శుభకరం, ఆనందకరం కావాలని ఆశిస్తూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు..!!
- మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీరాముడు రక్షగా నిలవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!
- సీతారాములను నిత్యం స్మరించడమే కాదు వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకుని.. వారు నడిచిన ధర్మ మార్గంలోనే మనం నడవడానికి నడుంకట్టాలి.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!
- శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!
- ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని.. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!
Sri Rama Navami 2024 Quotes in Telugu:
"శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం.. రామనామ వరాననే"..
- శ్రీరామనవమి శుభాకాంక్షలు!!
"శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!"
- అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!!
"రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్..
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి"
- శ్రీరామనవమి శుభాకాంక్షలు!!
శ్రీరామనవమి రోజున ఆ జానకీ రాముడిని ఇలా పూజించండి - అష్టైశ్వర్యాలు లభిస్తాయి!
"పట్టాభిరామునికి ప్రియవందనం..
పాప విదూరునికి జయవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
అందాల దేవునికి మదే మందిరం"