Powerful Mantra to Start New Year:కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, చాలా మంది జనవరి 1వ తేదీన దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి సంవత్సరమంతా శుభం జరగాలని కోరుకుంటారు. అలాగే ఇంట్లోనూ పూజలు చేస్తుంటారు. అయితే, న్యూ ఇయర్ రోజున కొన్ని మంత్రాలు జపించడం వల్లకొత్త సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం సిద్ధింపజేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గణపతి మంత్రాలు :న్యూ ఇయర్ రోజున గణపతికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు. 'గం క్షిప్ర ప్రసాదనాయ నమః'అనే శక్తివంతమైన మంత్రం పఠించాలని.. దీనినే 'క్షిప్ర గణపతి మంత్రం' అని అంటారని అంటున్నారు. ఈ మంత్రం మనసులో జపించడం వల్ల కోరికలు తొందరగా నెరవేరతాయని.. ఈ మంత్రాన్ని వీలైతే 108 లేదా 54 లేదా 21 సార్లు మనసులో జపించాలంటున్నారు. అలాగే జనాకర్షణ కోసం 'గాం గీం గూం గైం గౌం గః' అనే మంత్రం పఠించాలని.. దీనిని 'గణేశ మాతృక న్యాస మంత్రం' అని అంటారని చెబుతున్నారు.
విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు :విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కొత్త సంవత్సరం రోజున 'ఓం నమో నారాయణాయ"అనేఅష్టాక్షరీ మంత్రం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ'అనే ద్వాదశాక్షరీ మంత్రాన్నిజపించమని సలహా ఇస్తున్నారు. వీటిలో ఏది చదివినా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఈ స్తోత్రం చదువుకోండి :కొత్త సంవత్సరం మొదటి రోజున గణపతి అనుగ్రహం కోసం శక్తివంతమైన 'సంకట నాసిక గణేశ స్తోత్రం' చదువుకోమంటున్నారు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం 'విష్ణు సహస్రనామం' చదువుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విష్ణు పంజర స్తోత్రం కూడా ఉంటుందని.. దానిని పఠించడం వల్ల శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ల ఎడుపులు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు.