Ayodhya Ram Mandir Inauguration Pooja At Home:ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతోంది. రామయ్య జన్మ స్థలమైన అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడు సాక్షాత్కరం కాబోతున్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
దేశమే కాదు.. యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. ఇక.. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్యకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరికీ కుదరదు. అలాంటి వారు ప్రాణప్రతిష్ఠ శుభ సమయంలో ఇంట్లోనే రాముల వారికి పూజ చేసుకోవచ్చంటున్నారు పండితులు. ఆ పూజా విధానాన్ని వారు వివరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
హైదరాబాద్ నుంచి బంగారు పాదుకలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 3లక్షల కిలోల బియ్యం- రాఘవుడికి ఎన్నో కానుకలు
శుభముహూర్తం: ఈరోజు(జనవరి 22, 2024) మధ్యాహ్నం 12:20 నుంచి 12:45 వరకు రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు శుభ ముహూర్తం. హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీ ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ 84 సెకన్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.
బాలరాముడి పీఠం కింద మహా యంత్రం- తయారు చేసింది చీరాల ఆయనే!- విగ్రహం ఎలా ప్రతిష్ఠిస్తారు?
ఇంట్లో పూజ చేసుకునే విధానం:
- ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత పూజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేయాలి. పూజ గది లేనివారు ఇంట్లో అనుకూలమైన ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేయాలి.
- పీఠం ఏర్పాటు చేయడానికి.. ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. తర్వాత ముగ్గులు వేసి.. పీఠం పెట్టాలి.
- తర్వాత పీఠం పైన ఎరుపు లేదా తెలుపు వస్త్రాన్ని వేసి.. రాముల వారి విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టి పూలతో అలంకరించుకోవాలి.
- తర్వాత పీఠం మీద కలశం ఏర్పాటు చేసుకోవాలి. దానిని పూలతో అలంకరించుకోవాలి.
- ఇప్పుడు కలశం ఎదురుగా.. శ్రీ రాముడు విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ పై పంచామృతాలతో(ఆవుపాలు, ఆవునెయ్యి, పెరుగు, తేనె, నీరు) అభిషేకం చేయాలి. అనంతరం నీటితో శుద్ధి చేయాలి.
- శుభ్రంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి ఎరుపు వస్త్రాన్ని చుట్టాలి. తర్వాత చందనంతో రామనామాలు దిద్దాలి.
- తర్వాత పూలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసి దళం మొదలైన వాటిని సమర్పించాలి. రామయ్యను ఎరుపు, పసుపు, తెలుపు పువ్వులతో పూజించవచ్చు.
- పూజ అనంతరం పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకంలతో పాటు ఇంట్లో తయారుచేసిన పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి.
- పూజ సమయంలో రామ నామాన్ని జపించండి. శ్రీ రామ్ చాలీసా పఠించండి. ఏక స్లోకి రామాయణం కూడా చదవవచ్చు.
- పూజ అనంతరం మంగళహారతి శ్లోకాలను పాటిస్తూ హరతివ్వాలి.
- ఇక దీపావళికి జరుపుకునే విధంగా సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసిన తర్వాత దీపాలను వెలిగించండి.
ఇనుము వాడకుండా రామాలయ నిర్మాణం- ఫస్ట్ ఫ్లోర్లో శ్రీరామ దర్బార్- ఆలయ ప్రత్యేకతలివే
రామ పూజ మంత్రం:'ఓం రామ రామాయ నమః' అనే రామ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఏక స్లోకి రామాయణం:ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ | వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ || వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ | పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||
వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు - 500 ఏళ్ల రామమందిరం కలలో అడ్డుంకులెన్నో