Animals in Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తే శుభ ఫలితాలు, మరికొన్ని కనిపిస్తే అశుభ ఫలితాలు ఉంటాయని అంటారు. ఇప్పడు ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
గోమాత
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో ఆవు కనిపిస్తే అదృష్టంగా చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గోవు పూజనీయమైనది. అలాంటి గోమాత కలలో కనిపిస్తే ఆ వ్యక్తి తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని స్వప్న శాస్త్రం చెబుతోంది.
ఏనుగు
కలలో ఏనుగు కనిపిస్తే ఆ వ్యక్తికి అతి త్వరలో రాజయోగం పట్టబోతోందని, సంపద పెరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
నాగరాజు
ఎవరికైనా కలలో పాము కనిపిస్తే తీరని కోరికలు తీరబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అంతే కాదు కలలో నల్ల పాము కనిపిస్తే కీర్తి పెరుగుతుందని అంటారు.
గుడ్లగూబ
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కనిపిస్తే ఆకస్మిక ధనలాభాలు కలిగి సంపద వృద్ధి చెందుతుందని తెలుసుకోవాలని స్వప్నశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
మృగరాజు
స్వప్న శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తికైనా కలలో సింహం కనిపిస్తే పదవీయోగం, పదోన్నతులు, ఐశ్వర్యం, విజయం లభిస్తాయని అర్థం చేసుకోవాలి.
దున్నపోతు
స్వప్నశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి కలలో దున్నపోతు కనిపిస్తే అతనికి సమీపంలో మృత్యు భయం ఉందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
హేతువాదులు ఏమంటున్నారు
స్వప్న శాస్త్రం కలలో కనిపించే వాటికి రకరకాల ఫలితాలు చెబుతున్నప్పటికీ, హేతువాదులు మాత్రం ఇవన్నీ కొట్టి పారేస్తున్నారు. ఒక వ్యక్తి నిద్రించే ముందు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడో, దేనిని ఎక్కువగా చూస్తూ ఉంటాడో అదే అతనికి స్వప్నంలో కనిపిస్తుందని అంటారు.
అందుకే ఏ విషయం గురించైనా ఒక నిర్ధరణకు వచ్చే ముందు వివేకంతో అలోచించి నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఎవరి అభిప్రాయం వారిదే! ఒకరి అభిప్రాయాన్ని మరొకరి మీద బలవంతంగా రుద్దరాదు.
ఏది ఏమైనా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దేవతలందరూ వాహనంగా జంతువులని ఎంచుకోవడం వెనుక ఏదో ఒక ధర్మసూక్ష్మం తప్పకుండా ఉండే ఉంటుంది. భూమిపై ఉన్న సకల ప్రాణులను సమానంగా చూడాలన్న అంతరార్థాన్ని గ్రహిస్తే అంతా శుభమే! అందరికీ క్షేమమే!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
జంతువులకు టైమ్ గురించి తెలుసా? చిన్నచిన్న వాటి పరిస్థితి ఏంటి? - Animals Time Experience
త్రినేత్రుడి మూడు రూపాలు- ఇలా పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి! - Lord Shiva Worship Benefits