తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశులవారికి కోరుకున్న ఉద్యోగం - వివాహం నిశ్చయం గ్యారెంటీ! - WEEKLY HOROSCOPE

అక్టోబర్‌ 20వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు వారఫలాలు

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 5:00 AM IST

October 20th to October 26th 2024 Weekly Horoscope : 2024 అక్టోబర్‌ 20వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు నివారించుకుంటే మంచిది. వ్యాపారులు నూతనంగా పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణభారాన్ని తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతుతో, సహోద్యోగుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి పరంగా ఎదగడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. స్నేహితులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత పదవులను చేపడతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఇది వరకు మీ మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనువైన సమయం నడుస్తోంది. వ్యాపారం ప్రోత్సాహకారంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు అనుకోకుండా ముందుకు సాగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అంకిత భావంతో పనిచేయడం అవసరం. భాగస్వామ్య వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాన్ని పొందడమే కాకుండా వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు అందరితో కలిసి పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి ఆనందం నెలకొంటుంది. విద్యార్థులు ఆశించిన విజయాలను అందుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమయ్యేవారు శుభవార్తలు అందుకుంటారు. బంధు మిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ బంధాన్ని పటిష్టం చేస్తుంది. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. లేకుంటే ఇది మీ వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో పెను మార్పులు జరుగుతాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు దూరదేశాల వారితో పరిచయాలు పెంచుకొని వ్యాపారాన్ని విస్తరిస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలితో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. సంతానం చెడు సావాసాల జోలికి వెళ్లే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి. పట్టుదల, కృషి ఉంటే చేపట్టిన వృత్తిలో విజయం సాధిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు జీవితంలో ఎదగడానికి ఒక అవకాశంగా మలచుకుంటే విజయం మీదే! అందరితో స్నేహపూర్వకంగా, సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి అనుకూలమైన సమయం. వృత్తి నిపుణులు, వ్యాపారులు సమష్టి కృషితోనే విజయాలు సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చుల పట్ల స్వీయ నియంత్రణ ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ వృత్తి, వ్యాపారాలలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. సదస్సులు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. మిత్రుల సహాయంతో లాభదాయకమైన అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. మీ లక్ష్య శుద్ధి కోసం తీవ్రంగా కృషి చేసి విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి కోరుకున్న అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు అందుతాయి. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీ పిల్లల అభివృద్ధి గర్వకారణమవుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కనకధారాస్తోత్ర పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రథమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వృత్తి పరంగా జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు సజావుగా సాగి మంచి ఫలితాలను తెస్తాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీకు మీ జీవితభాగస్వామికి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అనుబంధం దృఢ పడుతుంది. వారసత్వ వ్యాపారాలు నిర్వహించేవారు కాలానుగుణంగా మార్పులు చేసి గణనీయమైన లాభాలను అందుకుంటారు. విద్యార్థులు నూతనోత్సాహంతో చదివి ఉన్నత విజయాలను సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు కావడంతో సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన, స్పష్టమైన వృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన తేలితేటలతో వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలుగా మలుచుకొని ముందుకు దూసుకెళ్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. విదేశాలలో వ్యాపారాలు నిర్వహించే వారు తమ ప్రయాణాలలో అనుకూలతను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్థాన చలనం జరిగే సూచన ఉంది. వారం మధ్యలో గృహంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ ప్రతిభతో వాటిని పరిష్కరిస్తారు. ఈ రాశి వారు ఈ వారం ఆర్థికపరంగా శుభ ప్రయోజనాలను అందుకుంటారు. శత్రువుల నుంచి ఆపదలు ఎదురు కావచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి తిరుగు లేని మద్దతు పొందుతారు. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారులకు రావలసిన బాకీలు అన్నీ వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి అధిక లాభాలను అందుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి యోగవంతమైన కాలం. చేసే ప్రతి ప్రయత్నం విజయాన్ని అందిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విహారయాత్రలకు, తీర్థయాత్రల కోసం చేసే ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details