తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖం చూడాలో మీకు తెలుసా?' - Astrology Remedies Telugu - ASTROLOGY REMEDIES TELUGU

"నిద్రలేవగానే ఎవరి ముఖం చూశానో.. ఈ రోజంతా ఇలా ఉంది" అనేవారు చాలామంది ఉన్నారు. మరి.. ఇంతకీ పొద్దున్నే ఎవరి ముఖం చూడాలో మీకు తెలుసా? ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్​ దీనికి సమాధానమిస్తున్నారు.

Morning Face
Morning Face Health and Wealth (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 6, 2024, 4:27 PM IST

Morning Face Health and Wealth : రోజులో ఏదైనా చెడు జరిగితే.. ఉదయాన్నే ఎవరి ముఖం చూశానో అనుకుంటారు చాలా మంది. ఆ రోజు ఏ తప్పు జరిగినా కూడా ఆ నిందను వారి పైనే తోసేస్తుంటారు. ఇక నుంచి నిద్ర లేచిన వెంటనే వారి ముఖం అస్సలు చూడకూడదని డిసైడ్ అయిపోతుంటారు. మరి.. పొద్దున నిద్ర లేవగానే ఎవరి ముఖం చూడాలి? నిద్రలేవ గానే ఏం చేస్తే ధనం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి? అనే విషయాలను ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్​ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.

నిద్రలేవగానే ఇలా చేయండి..

నిద్రలేవగానే కళ్లు నలుపుకుంటూ మీ అర చేతులు మీరే చూసుకోవడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. ఇలా అరచేతులు చూడడం వల్ల పాజిటివ్​ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. మన అరచేతులు చూసిన తర్వాత.. దేవుడి చిత్రపటాన్ని చూడండి. ఇందుకోసం ఎల్లప్పుడూ మీ ఇష్ట దైవమైన.. చిన్న చిత్రపటాన్ని పడుకునే చోట ఉంచుకోండి. ఈ పనులు చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు.

ఆవు నెయ్యితో..

రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి తీసి పక్కన పెట్టుకుని పడుకోండి. ఉదయాన్నే నిద్రలేవగానే చేతితో.. అద్దానికి కాస్త నెయ్యితో బొట్టు పెట్టండి. తర్వాత అద్దంలో మీ ముఖం చూసుకోండి. ఇలా అద్దానికి.. నెయ్యితో బొట్టు పెట్టి మన ముఖం చూసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందట. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని వేణుగోపాల్​ అంటున్నారు.

ఇలా నిత్య జీవితంలో మనం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకుని రాత్రి పడుకునే వరకు.. చేసే ప్రతి పని గురించి కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారట. శాస్త్రం ప్రకారం.. వీటిని పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు. అందుకే ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

దసరా రోజున "విజయ ముహూర్తం" ఎప్పుడు? - జమ్మి చెట్టును ఎలా పూజించాలి?

'మ్యారేజ్​ ఫిక్స్​ చేసుకుంటున్నారా? - అయితే, వివాహ పొంతనలో ఈ విషయాలు తప్పకుండా చూడండి!'

ABOUT THE AUTHOR

...view details