How to Light the Kushmanda Deepam on kalashtami:నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనీ.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారినపడకుండా ఉండాలన్నా, ఎదుటి వాళ్ల ఏడుపులు, భయంకరమైన శత్రు బాధలు పోవాలన్నా.. కార్తిక మాసంలో వచ్చే కాలాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కార్తిక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారని.. అది నవంబర్ 23వ తేదీన వచ్చిందని జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. ఈ కాలాష్టమి శక్తివంతమైనదని.. ఆ రోజున శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగించినా, ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపం వెలిగించినా భయంకరమైన నరపీడ, దిష్టి, శత్రుబాధలు.. వీటన్నింటిని నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.
మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే:
- ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
- అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో 27 మిరియాలు ఉంచి మూట గట్టాలి.
- అనంతరం ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి. కాలాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో మిరియాల మూట నానేలా చూసుకోవాలి.
- అనంతరం సాయంత్రం పూట శివాలయంలో కారభైరవుడు విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్లి ఆయన ముందు మట్టి ప్రమిదను ఉంచాలి.
- అందులో నువ్వుల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను వత్తిలాగా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి.
- మిరియాల దీపం వెలిగించిన తర్వాత.. ఆ దీపం దగ్గర గారె ముక్కలు నైవేద్యంగా ఉంచాలి.
- అనంతరం కాలభైరవ దర్శనం చేసుకుని.. దీపం కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని(గారె ముక్కలు) శునకాలకు ఆహారంగా వేయాలి.