తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహా శివరాత్రి స్పెషల్- అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి! - sweet recipies

Maha shivratri Special Sweet Recipes : శివునికి అత్యంత ప్రీతికరమైనది మహాశివరాత్రి. మరి పరమ పవిత్రమైన ఈ రోజున శివుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలా అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ రెసిపీలను ఒకసారి ట్రై చేయండి!

Mahashivratri Special Sweet Recipies
Mahashivratri Special Sweet Recipies

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 4:50 PM IST

Maha shivratri Special Sweet Recipes : హిందూవులకు ఎంతో పవిత్రమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. కాగా ఈ ఏడాదిమహా శివరాత్రిమార్చి 8 తేదీన వచ్చింది. శివలింగాలకు అభిషేకం, ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతాయి. అయితే ఈ రోజున ఆ పరమ శివుడికి అరటి, ద్రాక్ష వంటి వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించడంతో పాటు, కొన్నిరకాల స్వీట్లనుకూడా పెట్టవచ్చు. మరి మీరు కూడా పండగ నాడు స్వామి వారికి వేటిని నైవేద్యంగా పెట్టాలని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ కథనం మీ కోసమే! మంచి రుచికరమైన ఆ స్వీట్‌ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అంజీర్‌ బర్ఫీ :

అంజీర్‌ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • అంజీర్‌ - 12
  • ఖర్జూరపండ్లు - 15
  • నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు
  • బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు - అరకప్పు
  • యాలకుల పొడి - పావు చెంచా

అంజీర్‌ బర్ఫీ తయారు చేయు విధానం :

  • ముందుగా అంజీర్‌, ఖర్జూరాలను కడిగి, మూడు గంటలు విడివిడిగా నానబెట్టాలి. ఈ రెండింటిలో కూడా స్వీట్‌ ఉంటుంది కాబట్టి, షుగర్‌ వేయాల్సిన అవసరం లేదు.
  • ఇప్పుడు అంజీర్‌ను నీటి నుంచి తీసి గ్రైండ్‌ చేయాలి. అలాగే ఖర్జూర పండ్లలో గింజలు తీసేసి వాటిని కూడా గ్రైండ్‌ చేయాలి.
  • ఆ తర్వాత స్టవ్​ మీద కడాయి పెట్టి అందులో 4 టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేయండి.
  • ఇప్పుడు వేడిగా ఉండే నెయ్యిలో బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, పండ్ల గుజ్జు, యాలకుల పొడి వేసి కలియ తిప్పుతూ వేయించాలి.
  • ఈ మిశ్రమం చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు దించేయాలి.
  • ఇప్పుడు వెడల్పయిన పళ్లెంలో కొద్దిగా నెయ్యి రాసి, పండ్ల మిశ్రమాన్ని సమంగా సర్దాలి. అంతే నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకుంటే అంజీర్‌ బర్ఫీ సిద్ధం.

అనాస కేసరి (Pineapple kesari) :

అనాస కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • ఉప్మారవ్వ- అర కప్పు
  • పంచదార - అర కప్పు
  • అనాస ముక్కలు - కప్పు
  • నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు
  • జీడిపప్పు - 16
  • కిస్‌మిస్‌ - కొన్ని
  • యాలకుల పొడి - పావు చెంచా
  • కుంకుమ పువ్వు - కాస్త
  • ఎల్లో ఫుడ్​ కలర్​ - చిటికెడు
  • పైనాపిల్‌ ఎసెన్స్‌ - కొద్దిగా

అనాస కేసరి తయారు చేయు విధానం :

  • ముందుగా మందపాటి పాత్రలో అనాస ముక్కలు, పంచదార వేసి కప్పున్నర నీళ్లతో ఉడికించాలి.
  • ఇప్పుడు పంచదార కరిగి, ముక్కలు మెత్తగా అయ్యాక కుంకుమ పువ్వు, ఫుడ్​ కలర్​, పైనాపిల్‌ ఎసెన్స్‌ వేసి బాగా కలిపి నిమిషం తర్వాత దించేయాలి.
  • ఇప్పుడు మరొక కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, ఉప్మారవ్వ, యాలకుల పొడి వేసి వేయించాలి.
  • అవి బంగారు రంగులోకి మారగానే కిస్‌మిస్‌, పైనాపిల్‌ మిశ్రమాన్ని యాడ్‌ చేయండి.
  • ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా కలియ తిప్పుతూ ఉడికించి, నాలుగు నిమిషాల తర్వాత దించేయాలి.
  • అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి పైనాపిల్‌ కేసరి రెడీ.

బాదం హల్వా :
బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • బాదంపప్పు - అర కిలో
  • పంచదార - కప్పున్నర
  • పాలు - రెండు కప్పులు
  • నెయ్యి - అర కప్పు
  • యాలకుల పొడి - పావు చెంచా
  • కుంకుమపువ్వు - కొద్దిగా
  • ఫుడ్‌ కలర్‌ - రెండు చుక్కలు

బాదం హల్వా తయారు చేయు విధానం :

  • ముందుగా అర కప్పు పాలలో కుంకుమపువ్వు వేసి మరిగించి శాఫ్రన్‌ మిల్క్‌ను రెడీ చేసి పక్కనుంచుకోవాలి.
  • ఇప్పుడు రెండు గంటలు నానబెట్టిన బాదంపప్పును, ఒక నిమిషం వేడి నీళ్లలో వేసి తీస్తే, పొట్టు తీయడం తేలికవుతుంది.
  • ఆ బాదంపప్పులకు కొన్ని పాలు జతచేసి గ్రైండ్‌ చేయాలి.
  • ఇప్పుడు కడాయిలో కాస్త నెయ్యి, బాదం మిశ్రమం వేసి సన్న సెగ మీద కలియబెడుతూ ఉడికించాలి.
  • తర్వాత అందులో మిగిలిన పాలు, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి అడుగంటకుండా మిశ్రమాన్ని బాగా తిప్పుతూ ఉడికించాలి.
  • చివర్లో శాఫ్రన్‌ మిల్క్‌ యాడ్‌ చేసి ఇంకో నిమిషం ఉంచి, దించేస్తే సరిపోతుంది. అంతే వారెవా అనిపించే బాదం హల్వా తయారైపోతుంది.

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!

పెసర పప్పుతో అధిక బరువుకు చెక్.. ఈ డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details