తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కోజాగరి పూర్ణిమ ఎప్పుడో తెలుసా? - ఆరోజు రాత్రి ఈ "వ్రతం" చేశారంటే - ఏడాదంతా ధన, కనక వర్షమేనట! - KOJAGIRI PURNIMA 2024 DATE

-ఆశ్వీయుజ మాసంలో పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది -కౌముది లక్ష్మీ వ్రతం చేసుకుంటే లక్ష్మీ దేవి పూర్తి ఆశీస్సులు!

KOJAGIRI PURNIMA POOJA RITUALS
Kojagiri Purnima 2024 (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 14, 2024, 11:58 AM IST

Kojagari Purnima Importance in Telugu: హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమిని చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో అశ్వీయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కోజాగరి పూర్ణిమగా పిలుచుకునే ఈ పవిత్రమైన రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చందని, భక్తులందరినీ అనుగ్రహించిందని విశ్వసిస్తారు. అయితే, ఈ సంవత్సరం "కోజాగరి పూర్ణిమ" ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి? ఆ రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధివిధినాలు పాటిస్తే లక్ష్మీదేవికటాక్షం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దేశంలో చాలా ప్రాంతాల్లో అశ్వీయుజ మాసంలో వచ్చే కోజాగరి పూర్ణిమను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీ పూజ చేయడానికి ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే, ఈ సంవత్సరం కోజాగిరి పూర్ణిమ అక్టోబరు 16, 2024 బుధవారం రాత్రి సమయంలో వస్తోంది. అంటే.. ఆరోజు రాత్రి పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి.. బుధవారం రాత్రి ఈ ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

శ్రీ మహాలక్ష్మీ భూలోక సంచారానికి వచ్చే.. ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్ధం వినిపిస్తూ ఉంటుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా తిష్ఠ వేసుకొని కూర్చుంటుందని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. "కోజాగరి పూర్ణిమ" అర్థం ఏమిటంటే.. నిద్ర మేల్కొని ఉండాల్సిన పూర్ణిమ. కాబట్టి, ఈ పవిత్రమైన రోజున(అక్టోబరు 16) అందరూ నిద్ర మేల్కొని.. రాత్రిపూట లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని పసుపు రంగు గవ్వలను తీసుకొని శబ్ధం చేయాలి. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య వీలైనప్పుడల్లా ఇంట్లో గవ్వల శబ్ధం చేస్తుండాలి. అలా చేస్తే.. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చంటున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్​.

అదే విధంగా.."కోజాగరి పూర్ణిమ" రోజు "కౌముది లక్ష్మీ వ్రతం" అనే ప్రత్యేకమైన లక్ష్మీ పూజ నిర్వహిస్తే సంవత్సరమంతా ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. అంతేకాదు.. లక్ష్మీ కటాక్షం వల్ల తిరుగులేని రాజవైభవం కలుగుతుందట.

కౌముది లక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలంటే?

  • ముఖ్యంగా కోజాగరి పూర్ణిమ రోజు రాత్రి సమయంలో మీ పూజా మందిరంలో కుడి చేతితో బంగారు నాణేలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  • ఆపై ఆ ఫొటోను గంధం, కుంకుమ బొట్లు అలంకరించుకొని.. వెండి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిపోసి ఆరు వత్తులు విడిగా వేసి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి.
  • ఆ తర్వాత సువాసన కలిగిన గులాబీ పూలతో పూజిస్తూ.. "ఓం నమో ధనదాయై స్వాహః"అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇవ్వాలి.
  • అనంతరం ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. అలా సమర్పించాక ఆ పాయసాన్ని వెన్నెలలో పది నుంచి 15 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రసాదాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కారం చేసుకొని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి.
  • ఇలా చీకటి పడ్డాక చేసే పూజలో ఆరు పసుపు రంగు గవ్వలు కూడా ఉంచాలి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆ గవ్వలకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.
  • పూజ పూర్తి అయ్యి నైవేద్యం స్వీకరించాక.. ఆ గవ్వలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి. దీన్నే "కౌముది లక్ష్మీదేవి వ్రతం" అంటారు.
  • అలా ఆ మూటను బీరువాలోదాచిపెట్టిన తర్వాత వాటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గవ్వలను మళ్లీ తీసుకొని.. ఆ గవ్వల శబ్ధం చేస్తూ ఉండిపోవాలి.
  • ఇలా రాత్రిపూట గవ్వల శబ్ధం చేస్తూ.. భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి సులువుగా పాత్రులై.. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

"మహిళలు సోమవారం ఇలా చేస్తే - మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది"!!

"ఇంట్లోని ఈ ప్రదేశాల్లో 'స్వస్తిక్' గుర్తు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహాం పొంది ధనవంతులవుతారు"!!

ABOUT THE AUTHOR

...view details