తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశివారు జాగ్రత్త- అనారోగ్యం పాలయ్యే ఛాన్స్​! - daily horoscope telugu today - DAILY HOROSCOPE TELUGU TODAY

Horoscope Today May 6th 2024 : మే​ 6న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 6th 2024
Horoscope Today May 6th 2024 (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 5:02 AM IST

Horoscope Today May 6th 2024 : మే​ 6న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం కోసం వేచి చూడండి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. తొందరపాటుతో సమస్యలు తెచ్చుకోవద్దు. న్యాయ పరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అజాగ్రత్తతో ఉంటే నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగస్థులకు పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారస్థులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా మంచి చెడు విచారించండి. లేకుంటే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారస్థులకు శుభసమయం. ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఎంతో చేయాలనుకుని ఏమి చేయలేకపోతారు. వృత్తి, వ్యాపార రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగస్థులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మేలు. కార్యసిద్ధి హనుమాన్ దర్శనం మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక మలుపులు జరుగుతాయి. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వైద్యం కోసం ధనవ్యయం ఉంటుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్థులు భాగస్వాములతో మంచి సంబంధాలను కలిగివుంటారు. ఉద్యోగస్థులు ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోతారు. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. పని పట్ల మీ అంకిత భావం, నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. ఖర్చులతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులు వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్థులకు ఆర్ధిక పురోగతి, స్థాన చలనం ఉండవచ్చు. శివారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో శాంతి ఉండాలంటే మీరు మౌనంగా ఉంటే మేలు. అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాలు తెచ్చుకోవద్దు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలు చేసే వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యవ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. హనుమాన్ చాలీసా పఠిస్తే ప్రతికూలతలు తొలగి పోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనుకోని అనారోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు రావడం వల్ల అశాంతికి లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఉద్యోగస్థులు అనుకున్నది జరగక నిరాశతో ఉంటారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు. వ్యాపారస్థులకు ఆర్ధిక నష్టం సూచితం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసర కోపం, ఆవేశం కారణంగా కలహాలు ఉంటాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఇంటా బయట అశాంతిగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. పరిస్థితులు చేజారిపోకుండా జాగ్రత్త పడండి. మీ కోపం కారణంగా అందరిలోనూ చెడ్డ పేరు వస్తుంది. మీ వ్యవహార శైలి మార్చుకుంటే అన్నీ సద్దుమణుగుతాయి. యోగా, ధ్యానంతో ప్రశాంతత కలుగుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పొదుపు చేసే దిశగా ఆలోచన చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గురు ధ్యానంతో శుభ ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details