తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రమోషన్ గ్యారంటీ! ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి - daily horoscope telugu - DAILY HOROSCOPE TELUGU

Horoscope Today May 2nd 2024 : మే​ 2న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 2nd 2024
Horoscope Today May 2nd 2024

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 4:57 AM IST

Horoscope Today May 2nd 2024 : మే​ 2న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనులన్నీ మందకొడిగా సాగుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. వాదనలకు దూరంగా ఉంటే మేలు. స్నేహితులతో వ్యాపార సంబంధ చర్చల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మేలు. మీకు ఎంతో ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదిత్య హృదయం చదివితే కార్యజయం ఉంటుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టినా కఠిన శ్రమ, సహనంతో వాటిని పరిష్కరిస్తారు. పనుల్లో ఆలస్యం ఉండవచ్చు కాబట్టి నిరాశ చెందకండి. సన్నిహితుల సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఆందోళన తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం మేలు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదం వీడండి. వ్యాపారస్థులకు అధిక ప్రయాణాల వల్ల అలసటతో ఆరోగ్యం దెబ్బతింటుంది. పూర్తి విశ్రాంతి అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం చేయండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో పురోగతి ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది. కొన్ని కీలక విషయాల్లో మీ సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. వ్యాపారస్థులకు మంచి కాలం నడుస్తోంది. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగస్థులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని చికాకు కలిగించే విషయాల కారణంగా ఈ రోజు అశాంతిగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. సన్నిహితులతో ప్రియమైన సంభాషణలు చేస్తారు. వ్యాపారస్థులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. గురు శ్లోకాలు చదివితే కార్య జయం ఉంటుంది

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మధురమైన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంలో మునిగిపోతారు. మీ శ్రేయోభిలాషులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. వ్యాపారస్థులు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారిస్తే మేలు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. స్థిరాస్తి వ్యాపారులకు మంచి కాలం నడుస్తోంది. దుర్గాదేవి ధ్యానం చేస్తే మరిన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అనుకోని విజయాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఒకేసారి కలిసి వస్తాయి. ఈ రోజు మీ ఆనందానికి హద్దు ఉండదు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తిపరమైన, వ్యాపారపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వైపుల నుంచి శుభ ఫలితాలు ఉండడం వల్ల ఈ రోజంతా సరదాగా, సంతోషంగా ఉంటారు. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల కోసం ఖర్చులు ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్థులకు వ్యాపారం పుంజుకుంటుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. లాభాలు కూడా విపరీతంగా వస్తాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ గ్యారంటీ! సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలవారు గతంలో చేసిన పొరపాట్ల గురించి ఆలోచించడం మానేసి, ప్రస్తుతం సమష్టి కృషితో విజయం సాధించడంపై దృష్టి సారించండి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం లేక నిరాశకు గురవుతారు. ఎంత కష్టపడి పని చేసినా ఎటువంటి ప్రశంసలు పొందరు. సహనం, సంయమనంతో ఉంటే విజయం మీదే! ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదివితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు. గృహంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. జీవితభాగస్వామితో కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారస్థులు రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్, కోరుకున్న స్థానానికి బదిలీ కూడా ఉంటుంది. మాతృవర్గం వారితో కలహాల కారణంగా మానసిక అశాంతికి గురవుతారు. శివారాధనతో ప్రశాంతత పొందుతారు.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమంలో గడుపుతారు. దైవసంబంధమైన కార్యక్రమాల కోసం ధనవ్యయం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. న్యాయ సంబంధ వ్యవహారాలలో మీదే జయం! ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్థులు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీ ప్రతిభతో మంచి నిర్ణయాలు తీసుకొని అందరినీ మెప్పిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అన్ని రంగాల వారికి మంచి సమయం నడుస్తోంది. శని శ్లోకాలు చదివితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details