Horoscope Today May 14th 2024 : మే 14న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మనోనిబ్బరంతో ఉండటానికి ప్రయత్నించండి. ఈ రోజు గ్రహసంచారం సరిగా లేనందున స్థిరాస్తులు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మిథునం (Gemini) :మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడే మార్గాల గురించి ఆలోచిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి కూడా ఇది మంచి సమయం. ఆశించిన ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. స్నేహితులు, బంధువుల నుంచి ఊహించని బహుమతులు, కానుకలు అందుకుంటారు. విందు వినోదాల్ల పాల్గొంటారు. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు ఈ రోజు శుభ పరిణామాలు జరుగుతాయి. చేపట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. సున్నితమైన విషయాల పట్ల అతిగా స్పందించకండి. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
కన్య (Virgo) :కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనుకోని ఖర్చులు రావడం వల్ల ధనవ్యయం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాల కారణంగా గృహంలో అశాంతి నెలకొంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. బంధువుల నుంచి అందిన ఓ సమాచారం మీకు బాధ కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ధ్యానంతో ఆపదలు తొలగుతాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి కారణం అవుతాయి. ఈ రోజు మీ జీవితం అనుకోని మలుపులు తిరిగే సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసల కోసం తీవ్రంగా శ్రమించాలి. మీరంటే గిట్టని వారి గురించి ఆలోచించవద్దు. హనుమాన్ చాలీసా పఠిస్తే శత్రుజయం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు సామాన్య ప్రయోజనాలే ఉంటాయి. ఉద్యోగులు మెరుగైన ఫలితాలను అందుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా సమస్యలతో అసహనంగా ఉంటారు. ఆరోగ్యం సహకరించదు. సున్నితమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకండి. గురు శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు అత్యంత శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పదింతలు పెంచుతాయి. భారీ లాభాలను ఈ రోజు చూడబోతున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. పిల్లల చదువులు కొంత ఆందోళన కలిగించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో పనిచేసేవారు ఈ రోజు తప్పకుండా విజయాన్ని చూస్తారు. ఉద్యోగస్తులకు వారి ప్రతిభ, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. పలు మార్గాల్లో ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. సృజనాత్మకతతో పని చేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్ధికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీలోని ప్రతిభను వెలికి తీయాల్సిన సమయం వచ్చింది. కష్టపడితే విజయం మీదే! కొన్ని సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని జయించాలంటే ఆదిత్య హృదయం పఠించండి.