తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు ఇవాళ వివాదాలకు దూరంగా ఉండాలి- సంయమనం పాటించడం బెటర్​! - వార ఫలాలు

Horoscope Today March 1st 2024 : మార్చి 1న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 1st 2024
Horoscope Today March 1st 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 4:59 AM IST

Horoscope Today March 1st 2024 :మార్చి 1న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : అందరి దృష్టి ఇవాళ మీ మీదే ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు రీఛార్జ్ అవ్వండి. మీ శక్తితో మీరు ఇవాళ చాలా సాధించగలరు.

వృషభం (Taurus) : ఈరాశివారికి ఈ రోజు అంతగా కలిసిరాదు. ఘర్షణలు, వాదనలు, వివాదాలకు మీరు దూరంగా ఉండటం మంచిది. ఘర్షణలు తప్పనిసరైన పరిస్థితుల్లో మీరు కాస్త వెనక్కి తగ్గి ఉండటం మంచిది. స్వీయ గౌరవం పోగొట్టుకోకుండా చూసుకుండి. ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు.

మిథునం (Gemini) :మీ చుట్టు ఉన్నవారిపై ఈ రోజు మీరు అధిక ధ్యాస పెడతారు. వారు కూడా మీకు తగినట్టుగా స్పందించి మీ సెంటిమెంట్లు, మీ భావనలను అర్థం చేసుకుంటారు. ఇది మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే ఈ రోజు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా సాగుతుంది.

కర్కాటకం (Cancer) :మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. బదిలీ, ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉంటాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలూ ఉన్నాయి. ఓ ఆకర్షణీయమైన ఉద్యోగాన్ని మీరు తిరస్కరించవచ్చు.

సింహం (Leo) :పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. స్నేహితులు, బంధువులు ఈ రోజు మిమ్మల్ని సందర్శిస్తారు. ఇంట్లో ఆహ్లాకదరమైన వాతావరణం ఉంటుంది. మీ స్నేహితులు, అతిథులకు మీరు చక్కని విందు ఏర్పాటు చేస్తారు.

కన్య (Virgo) : మీ పరిచయాలు, సంబంధాల విషయంలో హేతువులు, భావనలు ఈ రోజు బాగా ప్రభావం చూపుతాయి. ఎమోషనల్​గా మీరు కొంత సందిగ్ధావస్థలో ఉంటారు. ఇతరుల ఆలోచనల కంటే మీ అభిప్రాయానికి మీరు ఎక్కువ విలువ ఇస్తారు.

తుల (Libra) : మీలోని నాటకీయత బయటకు వస్తుంది. మీరు చేస్తున్న ప్రతీ పనిలో ఏదో విచిత్రం ఉండేలా మీరు ఇవాళ వ్యవహరిస్తారు. అది మీ పనిపట్ల మీ నిబద్ధత కావచ్చు.

వృశ్చికం (Scorpio) :రాశి ఫలాలను బట్టి ఇవాళ మీరు డబ్బు బాగా ఖర్చు చేస్తారు. అయితే ఆ ఖర్చు చేసేది మీ ప్రియమైనవారి కోసమే. మీకు ప్రియమైనవారితో ఏదైనా ట్రిప్ లేదా ఔటింగ్​కు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీనక్షత్ర బలంగా చక్కగా ఉంది. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ప్రశంసలు అందుకుంటారు. ఇతరులను కష్టాల్లో ఉంటే దాన్ని చక్కదిద్దే గుణం మీలో ఉంది. మీ ఈ పనితీరు వల్ల ఇతరుల హృదయాలు గెలుచుకుంటారు.

మకరం (Capricorn) :పని ప్రదేశంలో బహుమతులు, ప్రశంసలు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. మీ తోటి ఉద్యోగులు మీరు బహుమతులు అందుకుంటుంటే ఈర్ష్యపడతారు. ఉద్యోగం మారాలనే ఆలోచన చేస్తున్నవారు కొంత కాలం ఆగితే మంచిది. ఇది మీకు సరైన సమయం కాదు.

కుంభం (Aquarius) :మీరు మీ పోటీదారులతో తగాదా పడవద్దు. మీరు శారీరకంగా అస్వస్థతగా ఉండవచ్చు. బద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినా మీరు మానసిక ఆనందం అనుభవిస్తున్నారు. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చులు ఉండవచ్చు. పిల్లల గురించి దిగులు చెందుతారు. మీరు విదేశాల నుండి శుభవార్త వింటారు.

మీనం (Pisces) :అనైతికమైన కార్యకలాపాలల్లో ఇరుక్కోవద్దు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి. నెగిటివిటీ మీ పర్సనల్ లైఫ్​ను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఖర్చులు పెరుగుతాయని ఫలితాలు చెబుతున్నాయి. మీరు అశాంతిగా ఉంటారు.

ABOUT THE AUTHOR

...view details