తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్​! అనారోగ్య సమస్యలు ఉంటాయ్!! - Daily Horoscope In Telugu

Horoscope Today July 5th 2024 : జులై​ 5న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 4:28 AM IST

Horoscope Today July 5th 2024
Horoscope Today July 5th 2024 (ETV Bharat)

Horoscope Today July 5th 2024 :జులై​ 5న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం చేసే కృషి సత్ఫలితాలను ఇస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్ధికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు పనిభారం పెరిగినా సహోద్యోగుల సహకారంతో అన్ని సకాలంలో పూర్తి చేస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని నుంచి కొంత విరామం తీసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. దైవబలం అండగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పనులు పూర్తి కావాలంటే మీ పూర్తి శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తే తప్ప సాధ్యం కాదు. కుటుంబంలో కలహాలతో అశాంతిగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. సూర్య నమస్కారాలు, యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇంటికి బంధు మిత్రుల రాకతో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో అభివృద్ది ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్థానచలనం సూచన ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణ శక్తినిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయం చేకూరుస్తాయి. వ్యాపారస్థులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్థులకు బదిలీలు, ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీడియా, పత్రికా రంగం వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు ఆలోచించి, అనుభవజ్ఞులు సంప్రదించి ముందుకెళ్తే నష్టాలూ రావు. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి శ్రమతోనే విజయం ఉంటుంది. పనిభారం చాలా తీవ్రంగా ఉంటుంది. శ్రమాధిక్యత కారణంగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా గడపటం మేలు చేస్తుంది. సహనంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో వివాదాలు ఏర్పడవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలవారు తమ రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. కళాత్మక విషయాలపై అభిరుచి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొనాలంటే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పటికి సమర్ధంగా అధిగమిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు మౌనంగా ఉంటే మేలు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న మానసిక క్షోభ నుంచి బయట పడతారు. వృత్తి వ్యాపార రంగాల వారు సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగస్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు ఈ రోజు వేగవంతమవుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుంది. భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగస్థులకు అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసి పదోన్నతులు పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ఉద్యోగస్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వృధా ఖర్చులు అరికడితే మంచిది. స్థిరాస్తి రంగం వారు కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. అనుకూల ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారస్థులు ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు నష్టాలు తెస్తాయి. ఉద్యోగస్థులు పని ప్రదేశంలో గట్టి పోటీ ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇంటా బయటా కలహాలు తప్పవు. అనారోగ్య సమస్యలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details