తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

నేడు ఆ రాశి వారు ఏ పని చేపట్టినా అడ్డంకులే- ఆదాయ విషయంలో కూడా నిరాశే! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today July 29th 2024 : జులై​ 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 3:50 AM IST

Horoscope Today July 29th 2024 : జులై​ 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేక నిరాశకు లోనవుతారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలించవు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం నడుస్తోంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పెట్టుబడులు, లాభాలు వృద్ధి చెందుతాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగులు గొప్ప విజయాలను అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభాలను అందుకుంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఉద్యోగులు తమ సహచరులు, స్నేహితుల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్ధికంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పని భారం పెరగడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే ఆస్కారముంది. పని ప్రదేశంలో సహచరులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇంటి మరమ్మతుల కోసం ధన వ్యయం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. అసూయపరులు మీ హృదయాన్ని గాయపరచవచ్చు. అలాంటి వారి పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రకృతికి దగ్గరగా గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. గణపతి ప్రార్ధన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. తొందరపడితే నష్టం వాటిల్లుతుంది. ఏదైనా పని చేపట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేని పక్షంలో మీ ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. వృత్తిలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలమవుతాయి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వివాదాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకోడానికి ఆత్మశోధన చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణ శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఫలితాలు ఆలస్యమయినా నిరాశకు లోను కావద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. భావోద్వేగానికి లోను కాకుండా ప్రశాంతం ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఈ రోజు ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. కీలకమైన వ్యవహారాలు ముందుకు సాగక పోవడం వల్ల మానసికంగా చికాకుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కీలకమైన వ్యవహారాల్లో మొండిగా లేకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త అసైన్ మెంట్స్ మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. స్థిరమైన ఆలోచనతో ఉంటూ తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెబితే మంచిది. రచయితలకు, కళాకారులకు ఈ రోజు చాలా మంచి రోజు. సమాజంలో సన్మాన సత్కారాలు పొందుతారు. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. కొందరి మాటలూ, ప్రవర్తనలూ మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలను వాయిదా వేస్తే మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఎటు చూసినా శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో అసాధారణమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్, కోరుకున్న చోటుకు బదిలీ, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్వార్ధాన్ని వీడి పరోపకారం గురించి పనిచేస్తే మీకు శుభం జరుగుతుంది. వృత్తి నిపుణులు కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కలహాలు ఉండవు. వ్యాపారస్తులు కొత్త అసైన్ మెంట్స్‌తో హడావుడిగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details