తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి కొత్త బాధ్యతలు- ఆర్ధిక పరిస్థితి నార్మల్​గానే! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today July 20th 2024: జులై​ 20న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 5:10 AM IST

Horoscope Today July 20th 2024: జులై​ 20న (శవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేమేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. తీరికలేని పనుల కారణంగా విశ్రాంతి లేమి, అలసటగా ఉండవచ్చు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళనతో ఉంటారు. పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యాపారులు ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేదంటే నష్టాలకు గురికావచ్చు. అనారోగ్యం కారణంగా విచారంగా ఉంటారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు వర్గంలో, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఈ రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి గొప్ప విజయాలు ఉంటాయి. వ్యాపారులకు వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది, పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. స్థిరాస్తి రంగం వారికి పట్టింది బంగారం అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అదృష్ట యోగాలు ఉంటాయి. సహోద్యోగులు నుంచి సహకారాలు అందుతాయి. మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులకు, ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులకు చేసే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు. వ్యాపారస్తులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు వ్యక్తిగత సమస్యల కారణంగా పనిపై దృష్టి సారించలేక పోతారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ధన నష్టం సూచితం. కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా డీల్ చేయాలి. దైవబలం పట్ల విశ్వాసంతో ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శనికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. రక్తసంబంధీకులతో అనుబంధాలు దృఢ పడతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారులకు ఈ రోజు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి శుభకరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులకు పదింతలు లాభాలు అందుకుంటారు. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తారాబలం వ్యతిరేకంగా వుంది కాబట్టి ఈ రోజు మీ మాటలు అదుపులో ఉంచుకోండి. లేకుంటే కుటుంబ వ్యవహారాల్లో గొడవలు జరిగే అవకాశం వుంది. వ్యవహారం చెడకుండా ఉండాలంటే పట్టు విడుపు ధోరణి అవలంబించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండక పోవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి ప్రమోషన్ అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్ధ యాత్రలకు వెళ్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో భారీ నష్టాలూ ఉండవచ్చు. ఈ కారణంగా విచారంగా ఉంటారు. సామాజిక, దైవ కార్యకలాపాల కోసం ధనవ్యయం చేస్తారు. ఈ రోజు మీ సంపదకు, ప్రతిష్ఠకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. శని స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ముఖ్యంగా వ్యాపారులకు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని విసరిస్తారు. పెట్టుబడుల పైన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, బదిలీలు వంటి శుభ ఫలితాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా చాలా అద్బుతమైన రోజు. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది. పై అధికారులు మీ పనితీరుకి తృప్తి చెందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టించి పనిచేసి సంఘంలో మీకంటూ గుర్తింపును సాధిస్తారు. గణపతి ప్రార్ధన శుభాలనిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details