Horoscope Today January 15th 2025 : 2025 జనవరి 15వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికిఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్వశక్తితో లక్ష్యాలను సాధిస్తారు. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రచయితలు, కవులు తమ వృత్తి పరంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఉండవచ్చు. బుద్ధిబలంతో సమస్యలను పరిష్కరిస్తారు. స్వస్థానప్రాప్తి ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గోసేవ చేయడం మంచిది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు ఆలస్యమయినా అనుకున్న ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. నిర్ణయాలలో స్థిరత్వం అవసరం. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనంతో ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అభయ ఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రమైన కృషి అవసరం. ఇతరుల వ్యాఖ్యలను అతిగా స్పందిచవద్దు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో సహనంతో ఉంటే బంధాలు బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. దుర్గా స్తుతి పారాయణ ఉత్తమం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలలో పనిచేయాలని కలలు కనేవారి ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. త్వరలో విదేశీయానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంపద క్రమంగా పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించడం మంచిది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిర సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళ్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఎవరితోనూ గొడవలకు దిగవద్దు. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉండవచ్చు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశావాదంతో ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఉండవచ్చు. దైవబలంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కలహాలు రావు. అవకాశవాదుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభప్రదం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం, కీర్తి, గుర్తింపు ఉండవచ్చు. మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం పొందుతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. వాయిదా వేయలేని కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు, విదేశీ పెట్టుబడుల నుంచి ధనప్రవాహం ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.