తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మనోధైర్యంతో 'భోగి' నాడు ఆ రాశుల వారు చేసే పనులన్నీ సక్సెస్​- నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం - DAILY HOROSCOPE

2025 జనవరి​ 13వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 4:22 AM IST

Horoscope Today January 13th 2025 : 2025 జనవరి​ 13వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మీ ప్రతిభతో కొత్త అవకాశాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల ద్వారా ఆర్థిక లబ్ది ఉండవచ్చు. ఖర్చులు పరిమితం చేసుకోండి. ప్రతికూలతను దూరం చేసుకోండి. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో వృత్తివ్యాపారాలలో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. స్థానచలనం సూచన ఉంది. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. సంపదలు కలిసివస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పధంతో చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతులు ఉండవచ్చు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులతో సమస్యలు రావచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఎదగడానికి బాటలు వేసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో అభివృద్ధిని చూస్తారు. వ్యాపారంలో ఆటు పోట్లు లేకుండా సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంబించకూడదు, ప్రయాణాలు చేయకూడదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మనోబలంతో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక సమస్యల కారణంగా అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కనకధారా స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి లోపిస్తుంది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. బంధువుల ప్రవర్తన బాధిస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలకు దిగడం సరైన పని కాదు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details