Horoscope Today February 21st 2025 : 2025 ఫిబ్రవరి 21వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు ఎదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అభయ ఆంజనేయ స్వామి ప్రార్ధనతో శుభ ఫలితాలు ఉంటాయి.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగి అద్భుతాలు సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కోపం అదుపులో ఉంచుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకూ,దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టిన ప్రతిపనిలోనూ సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఓ వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈశ్వర ఆరాధన శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ప్రియమైన వారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబంతో చేసే ఓ ప్రయాణం ఆనంద దాయకంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మీ ప్రణాళికలు సత్ఫలితాలను అందిస్తాయి. భవిష్యత్ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయి. వినోద కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల ఆశీస్సులు అండగా ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తారు. ధనలాభం ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహం నింపుతుంది. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతికూల ఆలోచనలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం శ్రేయస్కరం.