తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఓ శుభవార్త ఆ రాశివారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది - భుజంగ స్తోత్ర పఠనం మేలు! - HOROSCOPE TODAY FEBRUARY 14TH 2025

2025 ఫిబ్రవరి 14వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Horoscope Today February 14th 2025
Horoscope Today February 14th 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 5:01 AM IST

Horoscope Today February 14th 2025 : 2025 ఫిబ్రవరి 14వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. సమాజంలో మంచి గుర్తింపు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా గొప్ప శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీ నిజాయితీ, ఆత్మ విశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. ఆనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. సూర్యాష్టకం పఠించడం ఉత్తమం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులు తెలివిగా, జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. చేపట్టిన ప్రతీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. మీ శ్రద్ధ, పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీరామరక్షా స్తోత్రం పఠించడం శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మాచరణతో ముందుకెళ్లి పేరుప్రఖ్యాతులు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన చర్చలు, సమావేశాలలో మీ నిర్ణయం కీలమవుతుంది. సన్నిహితులతో తీర్థయాత్రలకి వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. దైవబలం అండగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శ్రద్ధాసక్తులతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. వృథా ఖర్చులు నివారించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విలాసాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. శని స్తోత్రం పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. ధార్మిక, సామాజిక కార్యక్రమాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సానుకూల ఆలోచనలతో మేలు కలుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ పంచాక్షరీ మంత్రజపం శక్తినిస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది జాగ్రత్తగా ఉండండి. కీలకమైన వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరించకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details