తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి - లేకుంటే విరోధులు పెరుగుతారు జాగ్రత్త! - Horoscope Today - HOROSCOPE TODAY

Horoscope Today August 30, 2024 : ఆగస్టు​ 30వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 4:01 AM IST

Horoscope Today August 30, 2024 :ఆగస్టు​ 30వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముందుచూపుతో, చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు పోటీని అధిగమించి మంచి లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్తగా ప్రారంభించబోయే ప్రాజెక్టులు, అసైన్​మెంట్లు కోసం పూర్తి సమయం కేటాయిస్తారు. పని ఒత్తిడి కారణంగా ఆందోళనకు గురవుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉండవచ్చు. యోగా ధ్యానంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల వారు తమ తమ రంగాలలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు లేక నిరాశకు లోనవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. దీనితో మనశ్శాంతి కోల్పోతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తెలివిగా, పొదుపుగా ఖర్చుచేయండి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నేత్ర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే విరోధులు పెరుగుతారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం, ఇతర ఆర్ధిక వనరులు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ కలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంజనేయ స్వామి ధ్యానం శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అరుదైన అవకాశాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలు ఉన్నాయి. సృజనాత్మకతతో ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. ఇంటి మరమ్మత్తుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యల కారణంగా ఆందోళనల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఉంటారు. సంతానంతో విభేదాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అనుకోని ఆపదలు, గండాలు ఉండవచ్చు. మీరు చేసే దైవ కార్యకలాపాలు, దేవునిపై నమ్మకం దురదృష్టకర పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తాయి. పనుల్లో ఆటంకాల కారణంగా అశాంతి, చికాకుగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. సన్నిహితులతో మాట్లాడేటపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పరాయణతో ఆపదలు తొలుగుతాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. వ్యాపారులు భాగస్వాముల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రక్తసంబంధీకులతో గతంలో ఉన్న అపార్ధాలు తొలగిపోయి అనుబంధం దృఢపడుతుంది. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో సవాళ్ళను సమర్థవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఖర్చులకు తగినట్లుగా ఆదాయం కూడా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు అత్యద్భుతంగా పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఉద్యోగులు ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో తిరుగులేని విజయాలను సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంటికి బంధువుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details