Horoscope Today August 25th 2024 :ఆగస్టు 25వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. అందరితో సామరస్యంగా ఉంటే మంచిది. ఆధిపత్య ధోరణి, దూకుడు తగ్గించుకోవాలి. లేకుంటే వృత్తిలో సహచరుల సహకారం లోపిస్తుంది. కొత్త పనులు ఈ రోజు ప్రారంభించవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకునేముందు అన్ని కోణాలూ పరిశీలించాక, ఒక దృఢమైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అభిప్రాయభేదాలు నెలకొంటాయి. ఉద్యోగులు ఎంత శ్రమ పడినా ఫలితం దక్కక నిరాశకు గురవుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. దైవబలం అండగా ఉన్నందున అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. అదృష్టయోగం, లక్ష్మీకటాక్షం ఉంటాయి. వృత్తి నిపుణులు, వ్యాపారులు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకుంటారు. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొంతమంది బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలహాల కారణంగా అశాంతికి లోనవుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభప్రదం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా కాదు. అన్ని పనులు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రమైన కృషి చేయాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వెంచర్లు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు మొదలు పెట్టడానికి శుభప్రదంగా ఉంది. ఉద్యోగులు ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే మంచిది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
తుల (Libra) :మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఫలితంగా ఏ పని పట్ల శ్రద్ధ లేకుండా నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, వివాదాలు ఏర్పడుతాయి. ఇంట్లో సుఖశాంతులు లోపిస్తాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం కూడదు. వ్యాపారంలో భాగస్వాములతో మనస్పర్థలకు అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే ఆపదలు తొలగిపోతాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇన్ని రోజులుగా ఉన్న చెడు గ్రహ ప్రభావం తొలగిపోయి మంచిరోజులు మొదలయ్యాయి. ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగులు ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. శివారాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చెడు గ్రహాల ప్రభావం ఇంకా తొలగిపోలేదు. అయితే గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సంతానం అనారోగ్యం ఆందోళనకు కలిగిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అల్ల కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణం కారణంగా మానసికంగా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కుటుంబ కలహాలు తారస్థాయికి చేరుతాయి. ఈ ప్రభావం మీ ఆరోగ్యం పై పడుతుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మీ ప్రియమైన వారితో మీరు గొడవ పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం సహకరించదు. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. మొండితనం, నిర్లక్ష్య వైఖరీ వీడితేనే సమస్యలు తగ్గుముఖం పడతాయి. నవగ్రహ పూజలు జరిపిస్తే మేలు జరుగుతుంది.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆదాయంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతిమాట వివాదాలకు, అపార్థాలకు కారణమవుతుంది. సందర్భానుసారంగా మాట్లాడితే మంచిది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. వృథా ఖర్చులు తగ్గించాలి. పొదుపు పై దృష్టి సారించాలి. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం.