తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి అన్నింట్లో పాజిటివ్ రిజల్ట్సే- హనుమాన్ చాలీసా చదివితే మరింత! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 21st 2024 : ఆగస్టు​ 21న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 3:50 AM IST

Horoscope Today August 21st 2024 :ఆగస్టు​ 21న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగులు చక్కని ప్రణాళికతో అన్ని పనులు సమయానికి పూర్తి చేసి పదోన్నతులు లొంగుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణతో శుభయోగాలు కలుగుతాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో విజయం కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు కోసం సమాజంలో పేరొందిన వ్యక్తులను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆర్ధిక సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మొదలు పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరగవచ్చు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. సంతానం అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోడానికి యోగా, ధ్యానం చేయండి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్ధిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయి. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతుతో ముందుకెళ్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు బుద్ధిబలంతో పని చేసి సత్వర విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. వ్యాపారంలో పోటీని తట్టుకునే క్రమంలో లాభాల శాతం తగ్గుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనిలో అనూహ్యమైన విజయాన్ని సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అకుంఠిత దీక్షతో అనుకున్న కార్యాన్ని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కోర్టు, న్యాయ సంబంధిత వ్యవహారాలు సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కలహాలకు ఆస్కారముంది. వృధా ఖర్చులను నివారించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. మీ శక్తి సామర్ధ్యాలను మొత్తం వెచ్చించి వృత్తి వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఆర్ధికంగా ఎదుగుతారు. సంపద పెరగడం ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గిట్టని వారు, అసూయపరులు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. ఉద్యోగంలో అనుక్షణం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం. వ్యాపారస్తులకు ధననష్టం సూచన ఉంది. మానసికంగా దృఢంగా ఉండడం అవసరం. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఓ సంఘటనలో బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యాలను సాధించే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో, దైవబలంతో ఎదుర్కొంటారు. చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. కుటుంబ కలహాల కారణంగా సంబంధాలు దెబ్బతినవచ్చు. వ్యాపారస్తులకు వృథా ప్రయాణాలు ఉండవచ్చు. ధననష్టం కలగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. లక్ష్మీకటాక్షం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. కొత్త పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details