తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి అన్నీ ప్రతికూల ఫలితాలే - ఆరోగ్యం విషయంలో జాగ్రత్త! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today August 20th 2024 : ఆగస్టు​ 20న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 4:31 AM IST

Horoscope Today August 20th 2024 :ఆగస్టు​ 20న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితుల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి కొత్తగా ఆరంభించే వెంచర్స్​కు శుభసమయం. వృత్తి నిపుణులు, వ్యాపారస్థులకు ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. ఊహించని ధనలాభాలుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల సూచన ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. గృహంలో శాంతి, సమాజంలో గౌరవం ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యాపారస్థులు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేదంటే నష్టాలకు గురికావచ్చు. అనారోగ్యం కారణంగా విచారంగా ఉంటారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజు తీవ్రమైన పోటీని చూడాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెక్యూలేషన్లకు ఈ రోజు అనుకూలంగా లేదు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు వృత్తి పరంగా జరిపే వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సూచన ఉంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితం ఈ రోజు కొత్త మలుపు తిరుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల వారు తమ బంగారు భవిష్యత్​కు అవసరమైన డబ్బును పొందేందుకు తగిన అవకాశాలను అన్వేషిస్తారు. ఉద్యోగస్థులకు ఊహించని విధంగా హోదా పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికత వైపు మీ మనస్సు మళ్లుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు పూర్తి శక్తిమంతులుగా ఉంటారు. ఉత్సాహం, శక్తి తొణికసలాడుతుంటాయి. మీ సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుత విజయాలను సాధిస్తారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ముందుకెళ్లి గొప్ప పేరు సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తివ్యాపారాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనర్ధం తప్పదు. కోపం తీవ్రస్థాయికి చేరితే మీ ఇమేజ్ దెబ్బతింటుందని గ్రహించండి. ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకపోతే నష్ట పోతారు. వ్యాపారంలో అధిక నష్టాలకు అవకాశం ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కల్మషం లేని మీ హృదయంతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎటువైపు చూసినా ప్రతికూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. పరిస్థితి మీ అదుపులో లేనప్పుడు మానసికంగా దృఢంగా ఉండడం అవసరం. సహనంగా ఉండటం ద్వారా గమ్యాన్ని చేరుకోగలరు. పని ప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో అప్రమత్తంగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కార్యసిద్ధి, శత్రుజయం, ఆర్థిక పురోగతి ఉంటాయి. జీవితంలో స్వయంకృషితో ఎదుగుతారు. మీ పోటీదారులు సరైన ప్రత్యర్థి అని కూడా నిరూపించుకుంటారు. ప్రత్యర్థుల ఆలోచనలను తల్లకిందులు చేస్తారు. క్లిష్టమైన వ్యవహారంలో కీలమైన నిర్ణయాలు తీసుకొని మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి తారాబలం బ్రహ్మాండంగా ఉంది. అందుకే విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. గ్రహాలు ఉచ్చదశలో ఉన్నందున మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మికంగా గడపడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులకు, ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగస్థులకు చేసే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు. వ్యాపారస్థులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details