తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు అలాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్​- లేకుంటే ఇబ్బందులే! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 17th 2024 : ఆగస్టు​ 17న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 3:22 AM IST

Horoscope Today August 17th 2024 :ఆగస్టు​ 17న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన వాదనలు, అర్ధంలేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఈ రోజు చాలా కఠినంగా ఉంటుంది. అసూయపరులు వృత్తి పరంగా అనేక ఇబ్బందులు కలిగించవచ్చు. ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉంటే సమస్యలు అవే తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. అన్ని రంగాల వారికి చేసే పని పట్ల ఉత్సాహం, ఏకాగ్రత లోపిస్తాయి. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు నష్టాలను తీసుకు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అందరినీ సంప్రదించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గురుధ్యాన శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత కలుగుతుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీదే పై చేయి అవుతుంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఎదురయ్యే పోటీ, సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. మాతృ వర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను పట్టించుకోవద్దు. వృత్తి వ్యాపారాలలో పోటీ తత్వం కారణంగా మిమ్మల్ని దెబ్బ తీయడానికి అవకాశం కోసం ఎదురు చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయానుకూలంగా నడుచుకుంటే విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసర చర్చలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, బద్దకం కారణంగా పనిలో నాణ్యత లోపిస్తుంది. ఏ పని కూడా సమయానికి పూర్తికాదు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి జీవితంలోని సమస్యల ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడుతుంది. ఇంట్లో అందరి పట్ల విసుగు, చికాకు ప్రదర్శిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలకు సమయం అనుకూలంగా లేదు. ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సర్వత్రా విజయం, ఆర్ధికవృద్ధి, శత్రుజయం ఉంటాయి. సన్నిహితులతో పర్యటక ప్రదేశాలలో పర్యటిస్తారు. దైవం మీద విశ్వాసం ఉంచి కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే అఖండ విజయం చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలు ఆస్తి వ్యహారాలలో మీదే తుది నిర్ణయం అవుతుంది. గణపతి ఆరాధన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనులలో పురోగతి లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి సాధించడం కఠినంగా ఉంటుంది. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి, తక్కువ ఫలితాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. రోజంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. గణపతి ప్రార్ధన శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ధార్మిక , సామాజిక కార్యకలాపాలలో ఎక్కువ పాల్గొనడం వల్ల ఖర్చు అధికం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. బంధువులతోనూ, కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి. వాహన ప్రమాదాలకు ఆస్కారముంది కాబట్తి జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు, అసైన్మెంట్లు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. వ్యాపార పరంగా, వృత్తిపరంగానూ లాభించవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. వృత్తికి సంబంధించి ఒక అనుకూల సంకేతం రావడంతో సంతోషంగా ఉంటారు. సంపద వృద్ధి చెందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్ధికపరంగా, వృత్తిపరంగా, విశేషమైన లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. అంతేగాక, వ్యక్తిగత జీవితంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. అనేక శుభసూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details