తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

నేడు ఆ రాశి వారు ఏ పని చేపట్టినా విజయమే! మరి మిగతా వాళ్ల పరిస్థితి? - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today 8th September 2024 : 2024 సెప్టెంబర్ 8న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 3:52 AM IST

Horoscope Today 8th September 2024 : 2024 సెప్టెంబర్ 8న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం, కార్యసిద్ధి ఉంటుంది. ఊహించని విధంగా సంపద కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకాల ద్వారా ధనం చేతికి అందుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. మీ మంచి మనసు, పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పక విజయం ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఉద్యోగంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. తొందరపాటుతో మాట్లాడటం ద్వారా బంధు మిత్రులలో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మేలు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో, ప్రతిభతో పనిచేసి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేపట్టినా విజయం మీదే! అన్ని రకాల అవరోధాలను తొలగించుకొని ధైర్యంగా ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంది. పని ప్రదేశంలో అందరి సహకారం అందుతుంది. వృత్తిలో పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగం వారిని అదృష్టం వరిస్తుంది. గొప్ప అవకాశాలను అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులు పనిలో మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు ఈ రోజే శుభకరంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకోని ఆటంకాలు, సవాళ్లు కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. అనారోగ్య సమస్యలు నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదనపు ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. దైవబలం మీద విశ్వాసంతో చిత్తశుద్ధితో పనిచేస్తే అన్ని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాలవారు ఈ రోజు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఆశించినంత ఉండదు. ఆర్ధికంగా కలిసిరాదు. సమయానికి డబ్బు చేతికి అందక రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. యాక్సిడెంట్లు జరిగే ప్రమాదముంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, పదోన్నతులు ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పనులు చేపట్టకూడదు. నమ్మిన స్నేహితుల ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details