తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / spiritual

ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - Daily Horoscope In Telugu

Horoscope Today 30th September 2024 : 2024 సెప్టెంబర్ 30వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 30th September 2024 :2024 సెప్టెంబర్ 30వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. పని ఒత్తిడి కారణంగా నీరసంగా, అలసటతో ఉంటారు. పని పట్ల నిబద్ధతత ఎంత అవసరమో విరామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమైనవని అర్ధం చేసుకోండి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఉండవచ్చు. తొందరపడకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. ప్రయాణాన్ని వాయిదా వేయండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కష్టించి పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు తెలివిగా వ్యవహరిస్తే మంచిది. లేకుంటే నష్టపోయే ప్రమాదముంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రమోషన్ అవకాశం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తరచుగా వచ్చే ప్రతికూల ఆలోచనలతో నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బంది పడతారు. కుటుంబంలో ఏర్పడిన సమస్యలను సావధానంగా మాట్లాడుకొని పరిష్కరించుకోండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.


సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రగతి మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించుకుంటారు. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త పనులు, బాధ్యతలు వస్తాయి. చేపట్టిన ప్రతీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాబడి అధికంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తారు. జీవిత భాస్వామి అండతో కీలకమైన విషయంలో విజయం సాధిస్తారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ మొండితనం, కోపస్వభావం కారణంగా ఎంతో నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కూడా శత్రువులు పెరుగుతారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. పెద్దలు, గురువుల సలహాలను అనుసరించి ముందడుగు వేయడం శ్రేయస్కరం. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవిని ఆరాధిస్తే ప్రశాంతంగా ఉంటారు.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎలాంటి టెన్షన్స్ లేని ప్రశాంతమైన రోజు. కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. అన్ని రంగాల వారికి గురుబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. సంపద పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. సమస్యలన్నీ తీరి ప్రశాంతంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో వ్యవహరించి పుకార్లు, వదంతులను దూరం పెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తారు. మీ పనితీరుతో, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరికీ మార్గదర్శకంగా ఉంటారు. ఇది మీపై మరింత బాధ్యతను పెంచుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల కారణంగా వృత్తి వ్యాపార రంగాల వారికి పనుల్లో తీవ్ర జాప్యం కలుగుతుంది. ఉద్యోగులకు పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తగిన విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారితో వాదనలు వద్దు. సహోద్యోగుల సహకారం కొంతవరకు ఉంటుంది. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణతో అన్ని సమస్యలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి. సామాజిక సేవా కార్యక్రమాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈశ్వర ఆరాధన శుభకరం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది.మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. చేపట్టిన అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు గతంలో రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. ప్రభుత్వ నుంచి రుణాలు అందుకుంటారు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలోఅనుకూలత ఉంటుంది. ఇంటా బయట ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగులతో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు దూకుడుగా ఉండవద్దు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details