ETV Bharat / offbeat

చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్​లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా? - Easy Kitchen Tools

Easy Kitchen Utensils : ఒక్క చుక్క లేకుండా నిమ్మరసం ఈజీగా పిండే స్క్వీజర్​.. ఒకేసారి రెండు కజ్జికాయలను సులభంగా చేసే మెషీన్లు ఉంటే ఎలా ఉంటుంది. వంటింట్లో పని చాలా త్వరగా అయిపోతుంది కదూ..! ఆ పరికరాలు ఎలా పని చేస్తాయో ఇప్పుడు చూద్దాం.

Easy Kitchen Utensils
Easy Kitchen Utensils (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 5:04 PM IST

Easy Kitchen Tools : మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఉపయోగించే వస్తువుల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ మంది పాత వాటిని వాడుకుంటూనే.. కొత్త వాటిని కొనుగోలు చేస్తుంటారు. మనం వంటింట్లో రోజూ వాడుకునే పాత్రలు, వస్తువుల్లో ఎక్కువగానే మార్పులు కనిపిస్తున్నాయి. కిచెన్​లో పనులు సులభంగా అయ్యేలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడూ కొత్త వస్తువులు తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్​గా మార్కెట్లోకి వచ్చి ఎక్కువగా అమ్ముడుపోతున్న కిచెన్​ పరికరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈజీగా నిమ్మరసం పిండొచ్చు
మనలో చాలా మందికి లెమన్ రైస్, జ్యూస్ అంటే ఎంతో ఇష్టం. కానీ నిమ్మరసం పిండడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇందుకోసం ఎక్కువగా స్క్వీజర్‌ను వాడుతుంటారు. ఈ సమయంలో స్క్వీజర్​తో ఎంత గట్టిగా ఒత్తినప్పటికీ ఎంతో కొంత రసం ఇంకా మిగిలే ఉంటుంది. ఆ తర్వాత చేత్తో నిమ్మకాయను తీసుకుని పిండితే కానీ పూర్తిగా రసం రాదు. కానీ, పోర్టబుల్‌ లెమన్‌ స్క్వీజర్‌తో ఈ శ్రమంతా ఉండదు. దీనిని స్లిమ్‌లైన్‌ డిజైన్‌తో తయారు చేశారు. దీనివల్ల నిమ్మకాయలోని రసమంతా ఒకేసారి పిండేయొచ్చు. అంతే కాదు మీరు ఈ స్క్వీజర్‌తో ఆరెంజ్, బత్తాయి లాంటివీ ముక్కలుగా కట్‌ చేసి సులువుగా రసం తీసుకోవచ్చు.

portable-lemon-squeezer
పోర్టబుల్‌ లెమన్‌ స్క్వీజర్‌ (ETV Bharat)

కజ్జికాయలు చేయడం ఇక సులభం
పండగలు, ఉత్సవాలు, శుభకార్యాల సందర్భంగా చాలా మంది ఇళ్లలో కజ్జికాయలు చేస్తుంటారు. అయితే, కజ్జికాయలను చాలా సులభంగా చేసుకోవడానికి మీకు ఆటోమేటిక్‌ డంప్లింగ్‌ మేకర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పరికరం సహాయంతో ఒకేసారి మీరు రెండు కజ్జికాయలను చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు తయారు చేసిన చపాతీలు రెండింటిని ట్రేల్లో పెట్టాలి. ఆ తర్వాత వాటిమీద కొద్దిగా పొడిపిండి చల్లి అందులో స్టఫ్‌ పెట్టేసుకుని బటన్‌ నొక్కితే చాలు. ఒకేసారి రెండు కజ్జికాయలు తయారైపోతాయి. దీనితో మీరు డంప్లింగ్స్‌ లాంటివి కూడా చేసుకోవచ్చు.

automatic-dumpling-maker
ఆటోమేటిక్‌ డంప్లింగ్‌ మేకర్‌ (ETV Bharat)

గుడ్లు పగిలిపోతాయన్న భయం లేదు
సాధారణంగా రెండు, మూడు కోడిగుడ్లను ఈజీగా ఉడికించుకోవచ్చు. కానీ, ఒకేసారి ఎక్కువ గుడ్లు ఉడికించాలంటే మాత్రం ఎక్కడ పగిలిపోతాయో అని కాస్త భయంగా ఉంటుంది. అయితే, మీ ఇంట్లో ఈ ఎగ్‌ స్టీమర్‌ ర్యాక్‌ ఉంటే మాత్రం చాలా సులభంగా ఉడికించుకోవచ్చు. దీనిలో సింగిల్, డబుల్‌ ర్యాక్‌ ఉన్నవి కూడా ఉంటాయి. గుడ్లను వాటిలో పెట్టి ర్యాక్‌కు ఉన్న హ్యాండిల్‌ సాయంతో కుక్కర్‌లో పెట్టి బాయిల్​ చేసుకుంటే సరిపోతుంది.

egg-steamer-rack
ఎగ్‌ స్టీమర్‌ ర్యాక్‌ (ETV Bharat)

ఇది కూడా చదవండి :

స్టౌ మీద చాయ్ పొంగడం చిరాగ్గా ఉంటోందా? - ఈ "Tea ఫౌంటెయిన్" ఉంటే ఆ సమస్యే రాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.