ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశుల వారికి శత్రువుల వల్ల ఆపదలు- బీ కేర్​ ఫుల్! - Weekly Horoscope - WEEKLY HOROSCOPE

September 29th to October 5th 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 8:59 AM IST

Updated : Sep 29, 2024, 4:37 PM IST

September 29th to October 5th 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు తమ వృత్తి వ్యాపారాలలో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ వాక్చాతుర్యంతో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. మిత్రుల సహాయంతో లాభదాయకమైన ప్రణాళికను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ లక్ష్య శుద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ప్రభుత్వ పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్థులు సహోద్యోగుల సహకారం అందుకుంటారు. మెరుగైన ఆదాయ వనరులను కలిగి ఉంటారు. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి ఈ వారం ఆశించిన అవకాశం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి ఊహించని లాభాలు అందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీ పిల్లల ఉన్నతి సమాజంలో మీకు మరింత గౌరవాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం అద్భుతమైన అవకాశం ఉంటుంది. లక్ష్య సాధనలో ఆరోగ్య సమస్యలు ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి సంబంధించిన పనులు వారం చివరిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది. భూమి, భవనాలు మరియు కుటుంబ ఆస్తి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సన్నిహితులతో పాటు, మీ కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకుంటే మంచిది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వృత్తి పని నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. అయితే ఆదాయాన్ని మించిన ఖర్చులు కూడా ఉంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ వారం గొప్ప శుభ సమయం నడుస్తోంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో అనవసరంగా విభేదాలు ఏర్పడవచ్చు. వాదనలు దిగకుండా ప్రశాంతంగా ఉంటే మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాట కరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు తమ తమ రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ వారం పొందుతారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాలలో వృత్తిని సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు విజయాన్ని పొందుతారు. మతపరమైన, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్థులు బదిలీ, ప్రమోషన్‌ను అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రధమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్థులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు సజావుగా సాగి మంచి ఫలితాలను తెస్తాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆదాయాన్ని మిచ్చిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ వారం శ్రేష్టమైన కాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి విజయసిద్ధి ఉంది. అన్నింటా సంతోషం, అదృష్టం పనిలో పురోభివృద్ధి ఉంటాయి. ఆర్ధికంగా సంతృప్తి కరమైన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. కీలక విషయాలకు సంబంధించి సమాజంలో ముఖ్య వ్యక్తులను కలుస్తారు. మీ పనితీరుకు పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి రంగం వారు ఆస్తి వ్యవహారాల వివాదాల నుంచి బయటపడతారు. మంచి లాభాలను గడిస్తారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదం. వైద్య చికిత్స కోసం అధిక ధనవ్యయం అవుతుంది. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో ప్రతి సమస్యను పరిష్కరించబోతున్నారు. జీవితం విసిరే ప్రతి సవాలును స్వీకరించి ముందుకు దూసుకెళ్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. ఉద్యోగస్థులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్థాన చలనం సూచన ఉంది. వారం మధ్యలో గృహంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ ప్రతిభతో వాటిని పరిష్కరిస్తారు. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా శుభ ప్రయోజనాలను అందుకుంటారు. శత్రువుల నుంచి ఆపదలు ఎదురు కావచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపారం చేసే వారు అభివృద్ధికి సంబంధించి శుభ వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు సన్నిహితులు, నిపుణులను సంప్రదిస్తే మేలు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభసమయం. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారికి ఈ వారం కోరికలు నెరవేరవచ్చు. కమీషన్ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా భూమి, భవనం లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయాలలో తొందరపాటు కూడదు. ఉద్యోగస్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పుతో వేచి చూస్తే మీరు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారు ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం. వాదనలకు దూరంగా ఉండటం ముఖ్యం. శని స్తోత్రాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు ఉత్సాహంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకున్నప్పటికిని ఖర్చులు అదుపు తప్పడం వల్ల అశాంతికి లోనవుతారు. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తే విజయం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులు తమ పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. కళ, సంగీతం లేదా జర్నలిజంలో పనిచేసే వ్యక్తులకు ఈ వారం అదృష్టంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. గృహంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదివితే శుభ ఫలితాలు ఉంటాయి.

Last Updated : Sep 29, 2024, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.