ETV Bharat / spiritual

'అక్టోబర్ 2న సూర్యగ్రహణం - ముందు రోజు ఇలా చేస్తే.. సొంత ఇంటి కల నేరవేరుతుంది' - Krishna Chaturdashi Tithi

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

October 1st 2024 astrology Special : అక్టోబర్​ 2వ తేదీన సూర్య గ్రహణం ఉంది. దానికి ముందు రోజున 'కృష్ణ అంగారక చతుర్ధశి తిథి' వచ్చింది. ఆ రోజున కొన్ని పనులు చేస్తే.. సొంతింటి కల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు.

October 1st 2024 astrology Special
October 1st 2024 astrology Special (ETV Bharat)

Krishna Chaturdashi Tithi Date 2024 : రాబోతున్న అక్టోబర్​ 2వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడనుంది. దానికి ముందు రోజున సూర్యగ్రహణంతో సమానమైన 'కృష్ణ అంగారక చతుర్ధశి తిథి' వచ్చిందని.. ఆ రోజున కొన్ని పనులు చేస్తే.. సొంతింటి కల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

కృష్ణ అంగారక చతుర్ధశి అంటే ఏమిటి?

ప్రతినెలలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథి.. మంగళవారంతో కలిసి వస్తే దానిని 'కృష్ణ అంగారక చతుర్ధశి'గా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కృష్ణ అంగారక చతుర్ధశి తిథికి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉందట. చాలా మంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం, వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానం ఇస్తుంటారు. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. అయితే, ఈ అక్టోబర్​ 1వ తేదీన దానం చేస్తే.. సూర్యగ్రహణం రోజు చేసినట్లుగా శుభ ఫలితాలు కలుగుతాయట.

ఆ రోజు ఏం చేయాలి ?

  • ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు బకెట్లో ఎర్రటి పూలు, కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి.
  • ఇలా చేస్తే సూర్యుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది. ఈ స్నానం నవ గ్రహాల్లో కుజుడికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు.
  • స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. నీళ్లలో ఎరుపు రంగు పూలు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఎండుమిర్చి గింజలు వేయాలి.
  • తర్వాత తూర్పుకి తిరిగి "ఓం గృణిహిః సూర్య ఆదిత్య ఓం" అని సూర్యుడి ఆర్ఘ్యం ఇస్తూ మొక్కలకు నీళ్లు పోయాలి.
  • ఇలా 12 సార్లు మంత్రం జపించాలి. ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

గోధుమలు దానం ఇవ్వాలి..

కృష్ణ అంగారక చతుర్ధశి తిథి రోజున ఎరుపు వస్త్రంలో ఒకటింపావు కిలో గోధుమలను మూట కట్టి బ్రహ్మణుడికి దానం ఇవ్వాలట. ఇలా చేస్తే సంవత్సరమంతా రవి బలం అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఈ రోజున యవలు దానం ఇచ్చినా కూడా మంచి జరుగుతుందట.

పితృ దర్పణం..

అక్టోబర్​ 1వ తేదీ మంగళవారం రోజున పితృ దర్పణం ఇస్తే.. మామూలు రోజుల్లో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఫలితం కలుగుతుందట.

యమ దీపం ఇలా పెట్టాలి..

కృష్ణ అంగారక చతుర్ధశి తిథి రోజున స్నానం చేసిన తర్వాత.. గృహంలో దక్షిణ దిక్కులో ఈ విధంగా దీపం వెలిగించండి. ముందుగా మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఎనిమిది వత్తులు ఒక వత్తిగా చేసి.. దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనిని కృష్ణ అంగారక చతుర్ధశి తిథినాడు వెలిగించే 'యమ దీపం'గా పిలుస్తారు. దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు తొలగిపోతాయి. అలాగే 'యం​.. యమయ.. నమః' అనే మంత్రం జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సూర్యాఅష్టకం, ఆదిత్యహృదయ స్తోత్ర పరాయణం చేసినా మంచి జరుగుతుందట.

  • రుణవిమోచక అంగారక స్తోత్రం చదివితే రుణ బాధలు తీరిపోతాయట.
  • ఎర్రటి వస్త్రంలో కందులను మూట కట్టి దానం ఇస్తే.. జాతకంలోని కుజ దోషాలు తొలగిపోతాయి. దీంతో పాటు అప్పుల బాధ తిరిపోతుందట.
  • అదేవిధంగా.. సొంత ఇంటి కల నేరవేరుతుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

కాశీలోని ఉత్తరార్క సూర్య దేవాలయానికి వెళ్లారా? ఒక్కసారి దర్శిస్తే ఆటంకాలన్నీ పరార్!

తిరుమలకు ముక్కోటి దేవతలు వస్తున్నారహో! వెంకన్న స్వామి 'గరుడ' వాహన సేవ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.