CM Revanth Reddy Released DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు. మొదటగా జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఆయన విడుదల చేశారు. మార్చి 1న 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. రిజల్ట్స్ కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ ఇక్కడ క్లిక్ చేయండి.
డీఎస్సీ ఫలితాలు కేవలం 55 రోజుల్లోనే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే డీఎస్సీ ఇచ్చిందని అది కూడా 7వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. టీఎస్‌పీఎస్సీనీ ప్రక్షాళన చేశామని తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు.
16 ఏళ్ల నిరీక్షణకు తెర - 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ జాబ్
కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు ఇచ్చాం. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 9న ఎల్బీస్టేడియంలో నియామక పత్రాలు ఇస్తాం. పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే డీఎస్సీ ఇచ్చింది. గత ప్రభుత్వం 7 వేల పోస్టులతో ఒకే నోటిఫికేషన్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తాం. - సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక 11వేల పోస్టులతో మరో నోటిఫికేషన్ : ఏడాది క్రితం సెప్టెంబర్‌లో గత ప్రభుత్వం సుమారు ఐదువేలకుపైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే వివిధ కారణాలతో పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫైనాన్స్ విభాగం ఆమోదించిన 5,976 పోస్టులకు పాత వాటిని జతచేసి మొత్తం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ , 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటరిగిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, 796 ఎస్జీటీ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల చొప్పున టీచర్ పరీక్షలు నిర్వహించారు.
TIN, VAT, PAN, DSC, DIN వీటికి అర్థం తెలుసా? - TIN TAN VAT PAN DSC DIN