Best Tips for Dishes Cleaning : ప్రతి ఇంట్లో స్టీల్, ఇత్తడి, రాగి, అల్యూమినియం వంటి రకరకాల ప్రాతలు ఉంటాయి. అయితే, ఆ గిన్నెలన్నీ శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో.. వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. అయితే, చాలా మంది దసరా వేళ ఇంటిని క్లీన్ చేస్తూ.. వాటిని కూడా శుభ్రం చేసి కొత్తవాటిలా మెరిపించాలనుకుంటారు. కానీ, కొన్ని పాత్రలపై ఉన్న మొండి మరకలు మాత్రం ఓ పట్టాన వదలవు. అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే.. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయని అంటున్నారు నిపుణులు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొన్నిసార్లు వంట చేస్తున్నప్పుడు గిన్నెలు మాడిపోతాయి. అప్పుడు.. నీళ్లల్లో రెండు చుక్కల నిమ్మరసం వేసి మరిగించి, కాసేపు ఆగి తోమితే ఆ మరకలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. అదేవిధంగా.. గిన్నెలకు జిడ్డు పడితే తొందరగా వదలదు. ఆ టైమ్‌లో నీళ్లల్లో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేసి తోమితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
వెండి పాత్రల విషయంలో
- వెండి పాత్రలు మెరుపు తగ్గకుండా ఉండాలంటే.. వాటిని భద్రపరిచే బ్యాగు, డబ్బాల్లో కర్పూరం వేసి చూడండి. పాత్రల మెరుపు తగ్గకుండా ఉంటుందట.
- ఇక క్లీనింగ్ విషయానికొస్తే.. లీటరు వేడినీటిలో అరచెక్క నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి, వాటిలో వెండి పాత్రలు ఉంచండి. 5 నిమిషాలయ్యాక కాస్త రుద్ది కడిగితే మెరుపు తిరిగొస్తుందని చెబుతున్నారు.
- పాత బ్రష్‌పై టూత్‌పేస్ట్‌ను తీసుకొని.. దాంతో వెండి వస్తువులను వృత్తాకారంలో రుద్ది 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే తేలిగ్గా శుభ్రపడతాయట.
స్టీల్ పాత్రల విషయంలో
- స్టీల్ పాత్రలు ధగధగ మెరవాలంటే బేకింగ్ సోడా నీటిలో.. పళ్లుతోముకునే పేస్ట్ కొద్దిగా వేసి తోమితే మంచి రిజల్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. వాటిపై ఉండే ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయట.
- స్టీల్ గిన్నెలను.. వాడేసిన టీ పొడితో రుద్దినా మెరుపు వస్తుందని అంటున్నారు. టీ, కాఫీ మరకలు పడే కప్పులను ఉప్పుతో కడిగితే ఈజీగా తొలగిపోతాయట.
- కొన్ని స్టీల్ పాత్రలకు అడుగుభాగంలో రాగి కోటింగ్ ఉంటుంది. అలాంటి వాటికి స్టీల్ ఒక్కటే కొత్తగా ఉంటే సరిపోదు.. రాగి పూత కూడా కొత్తదానిలా మెరవాలి. అందుకోసం.. టమాటా కెచప్‌ను రాగి కోటింగ్ ఉన్న ప్లేస్‌లో అప్త్లె చేసి 10 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆపై స్క్రబ్‌తో వాటిని శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయని అంటున్నారు.
- ఇక ఇళ్లలో వాడే పింగాణీ పాత్రలు మెరవాలంటే.. ముందుగా బూడిదతో తోమాలి. ఆ తర్వాత సబ్బు నీటితో కడిగితే కొత్త వాటిల్లా మెరిసిపోతాయట.
- అలాగే.. ఇత్తడి, రాగి వస్తువులను చింతపండు, ఉప్పు మిశ్రమంతో కలిపి తోమినట్లయితే కొత్తగా వాటిలా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్!