Horoscope Today November 30th 2024 : నవంబర్ 30వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇంటికి ప్రియమైనవారు, బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సృజనాత్మకతతో పనిచేసి సమాజంలో గుర్తింపు, మర్యాద పొందుతారు. మిత్రుల ద్వారా ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలతో ఈ రోజు చాలా ఒత్తిడితో ఉంటారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కోపావేశాలను నియంత్రణలో ఉంచుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించవచ్చు. స్థిరాస్తి రంగం వారు కొత్త వెంచర్స్ ఈ రోజు మొదలు పెడితే విజయవంతం కావు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు కొత్త వెంచర్స్ ఈ రోజు మొదలు పెడితే, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, దేవాలయ సందర్శన చేస్తారు. మాతృవర్గం నుంచి అందిన ఓ వార్తతో విషాదంలో మునిగిపోతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర కలహాలు, గొడవలతో ఈ రోజు మనశ్శాంతి లోపిస్తుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తగదు. సరైనవో, కాదో పరిశీలించకుండా కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ముఖ్యమైన వ్యవహారాలు చర్చకు వస్తాయి. అష్టలక్ష్మి ఆలయ సందర్శన శుభప్రదం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేసి వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న గొడవలు పరిష్కరించుకుంటారు. మీ అహాన్ని పక్కన పెట్టి రాజీ ధోరణితో ఉంటే కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి నిరాశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఖర్చులతో ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. కోర్టు విషయాలలో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో పని చేస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. వినోద విలాసాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు మీకు లక్ష్మీకటాక్షంతో సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారంలో చాలా లాభం చేకూరుతుంది. ఆదాయం పెరగడం వల్ల గానీ, లాభాలు రావడం వల్ల గానీ, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కోరుకున్న ప్రతి కోరికా నెరవేరుతుంది. ముఖ్యమైన ఆస్తి వ్యవహారాలు, ఒప్పందాలు చేయడానికి ఇది సరైన రోజు. ఉద్యోగులు కష్టించి పనిచేసి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ కలలు, కోరికలన్నీ నెరవేరతాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు సహోద్యోగులతో, పై అధికారులతోనూ మెలిగేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏది ఏమైనా, పని చేసే చోట వాతావరణం అనుకూలంగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది. గృహ వాతావరణం కూడా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు, వృత్తి నిపుణులకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. రచయితలకు, కళాకారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకంగా ఉండే మీ రచనల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికపరమైన విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఉద్యోగులు సహోద్యోగులతోనూ, ఉన్నతాధికారులతో అనవసరమైన సంభాషణలతో సమయం వృథా చేయకూడదు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.