Horoscope Today January 21th 2025 : 2025 జనవరి 21వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. ప్రతి రంగంలోనూ, మీరు విజేతగా నిలుస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు వెల్లి విరుస్తాయి. స్నేహితులతో, కుటుంబంతో విహార యాత్రలకు వెళ్తారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ లో దూసుకెళ్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా కష్ట కాలం. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆశించిన ఫలితాలు ఉండవు. జీవితంలో విజయాలు అంత సులభంగా లభించవని అర్ధం చేసుకుంటారు. కుటుంబ సమస్యల పట్ల సహనంతో వ్యవహరించాలి. వ్యక్తిగత సమస్యల ప్రభావం వృత్తిపై పడకుండా చూసుకోండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు తారా స్థాయికి చేరుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. అనారోగ్యం కారణంగా ఏ పనిపై ఆసక్తి ఉండదు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్థికపరమైన శుభ ఫలితాలు ఉంటాయి. సహోద్యోగుల సహకారంతో ఒక కీలకమైన పనిని పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో సానుకూల వాతావరణం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండి మనసుకు ఆనందం కలిగిస్తుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ కోపం, పరుషమైన మాటల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. మితిమీరిన కోపావేశాలు మీ ప్రియమైన వారితోనూ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇంటా బయట సమన్వయ ధోరణితో ఉండడం అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు వీలయినంత వరకూ లీగల్ విషయాలు డీల్ చెయ్యకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాగలలో అభివృద్హికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఆర్థికపరంగానూ, బిజినెస్ , ప్రొఫెషనల్ లైఫ్ లో గొప్ప లాభాలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగావ్యాపారాలలో అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఆత్మీయుల వలన మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండండి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో, పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ప్రయాణానికి సమయం శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవ దర్శనం మరింత శుబాన్ని చేకూరుస్తుంది. వృత్తి పరంగా బాగా రాణిస్తారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతోముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శివ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శని శ్లోకాలు పఠించడం ఉత్తమం.