Hotel Management : ఎక్కువ మందికి ఉపాధిని చూపిస్తూ, ఏటా వృద్ధి నమోదు చేస్తున్న రంగాల్లో ఆతిథ్యం చాలా ముఖ్యమైంది. ఈ విభాగంలో జాతీయ స్థాయి సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(IHM) ప్రధానమైంది. ఇది బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశాలకు ఎన్సీహెచ్ఎం జేఈఈ-2025 ప్రకటన విడుదల చేసింది. ఇందులో చేరడానికి ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసుకున్నవారు మేటి సంస్థల్లో సులువుగా ఉపాధిని పొందవచ్చు.
మేనేజ్మెంట్లో ఐఐఎంలు, ఇంజనీరింగ్‌లో ఐఐటీలు, మెడిసిన్‌లో ఎయిమ్స్ మాదిరి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు ఐహెచ్ఎంలు చిరునామా. ఇవి జాతీయ స్థాయిలో 21 సంస్థలను నెలకొల్పాయి. ఇవే కాకుండా రాష్ట్ర స్థాయి, పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు ఇలా 79 సంస్థల్లో ప్రవేశానికి ఎన్ఐఏ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎన్సీహెచ్ఎం-జేఈఈ) నిర్వహిస్తోంది. అన్ని సంస్థల్లోనూ కలిపి 12,000కు పైగా సీట్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హోటల్ మేనేజ్మెంట్లు :(కేంద్రం ఆధ్వర్యంలో)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(ఐహెచ్ఎం) - హైదరాబాద్ - 285 సీట్లు
- డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్(వైఎస్ఆర్ నిథమ్) - హైదరాబాద్ - 120 సీట్లు
- స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ - తిరుపతి - 60 సీట్లు
- తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ - సంగారెడ్డి(మెదక్) - 60
- శ్రీశక్తి, హైదరాబాద్ ప్రైవేట్ ఐహెచ్ఎం - 120 సీట్లు
పరీక్ష ఎలా : (ఆన్లైన్)
మొత్తం : 200 మార్కులు
సరైనన సమాధానానికి 4 మార్కులు, తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు
భాష : ఇంగ్లీష్, హిందీ
సమయం : 3 గంటలు
సిలబస్ :
- న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అననలిటికల్ ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు
- రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ - 30 ప్రశ్నలు
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ -30 ప్రశ్నలు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 60 ప్రశ్నలు
- సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు
1. న్యూమరికల్ అబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్ విభాగం : 8,9,10 తరగతుల గణిత పుస్తకాలు బాగా చదవాలి. ఇందులో వయసు, చైన్ రూల్, పని-వేతనం, సమయం-పని విభాగాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కూడికలుు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, గసాభా, కసాగు, నిష్పత్తి, సగటు, భిన్నాలు మొదలైన వాటిలో ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనలు చేస్తే మంచిది.
2. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ విభాగం : ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలను బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. సిరీస్, బ్లడ్ రిలేషన్లు, వెర్బల్ రీజనింగ్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ విభాగాలపై దృష్టి పెట్టాలి.
3. కరెంట్ అఫైర్స్, జీకే విభాగం : జనరల్ నాలెడ్జ్(స్టాక్ జీకే) నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. పాలిటీ, హిస్టరీ, జనరల్ సైన్స్ల్లోని ప్రాథమిక అంశాల నుంచి వీటిని అడుగుతున్నారు. వీటిలో కూడా 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. కరెన్సీ, రాజధానులు, క్రీడలు-విజేతలు, పార్లమెంట్లు, పుస్తకాలు-రచయితలు వీటిని ప్రాధాన్యంతో చదివితే మంచిది.
4. ఆంగ్ల విభాగం : ఈ విభాగంలో ప్రశ్నలు మరీ కష్టమేమీ కాదు. వ్యతిరేక పదాలు, సమానార్థాలు, ప్రిపొజిషన్లు, కంజంక్షన్లు, పాసేజ్ మొదలైన విభాగాల నుంచే అడుగుతున్నారు. హైస్కూల్ పాఠ్యాంశాల్లోని వ్యాకరణాంశాలు బాగా అధ్యయనం చేస్తే మంచి స్కోరు రావచ్చు.
5. సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ విభాగం : ఈ విభాగంలోని ప్రశ్నలకు ఆలోచించి, విచక్షణతో సమాధానం గుర్తించాలి. ఆతిథ్య, పరిశ్రమ, సేవారంగంపై అవగాహన పెంచుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
సన్నద్ధతలో మాక్ టెస్టులు మేలు : పరీక్షకు ముందు ఐదారు మాక్ టెస్టులు రాస్తే ప్రయోజననం ఉంటుంది. పరీక్షవారీ మార్కులు సరిచూసుకుని, ఫలితాలు విశ్లేషించుకుంటూ, సన్నద్ధతను మెరుగు పరుచుకుంటే మేటి సంస్థలో సీటును సొంతం చేసుకోవచ్చు.
మంచి స్కోర్ కోసం ఈ విధంగా చేయండి :
- ఈ పరీక్ష మరీ అంత కష్టంగా ఏమీ ఉండదు.
- సగం ప్రశ్నలు సులువు, మిగిలినవి మధ్యస్థంగా ఉంటాయి.
- కేంద్రీయ ఐహెచ్ఎంల్లో సీటు పొందడానికి మేటి స్కోరు తప్పనిసరి.
- పాత ప్రశ్నపత్రాలు శ్రద్ధగా పరిశీలించాలి.
- ప్రశ్నలు ఏ అంశాల నుంచి, ఏ స్థాయిలో అడుగుతున్నారో గమనించి సన్నద్ధతను అందుకు తగ్గట్లుగా మలచుకోవాలి.
- ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా ఉన్న పలు ఇతర సంస్థల్లోనూ చేరవచ్చు.
కోర్సు వ్యవధి : బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. అలాగే ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీసు, అకామడేషన్ ఆపరేషన్, అకౌంటింగ్, హోటల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, కంప్యూటర్స్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంశాల్లో అధ్యయనం చేస్తారు. అలాగే హాస్పిటాలిటీ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్ మేనేజ్మెంట్, రెవెన్యూ మేనేజ్‌మెంట్‌లోనూ శిక్షణ ఇస్తారు. కోర్సు చివరలో పేరున్న హోటల్లో ప్రాజెక్టు వర్కు పూర్తి చేయాలి.
ఉద్యోగాలు : జాతీయ ఐహెచ్ఎంల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది ప్రాంగణ నియామకాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. రిసార్ట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, ఫుడ్ చెయిన్ సంస్థలు, హాలిడే హోమ్‌లు వీరిని తీసుకుంటారు. అలాగే చదివిన స్పెషలైజేషన్ అనుసరించి హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, కిచెన్ మేనేజ్మెంట్, ఫ్లైట్ కిచెన్స్, ఆన్‌బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్, షిప్పుల్లో సఫ్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు, క్యాటరింగ్ సంస్థలు, పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, మరోవైపు బహుళ జాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్ కీపింగ్ నిర్వహణ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఫ్యాకల్టీ తదితర అవకాశాలు దక్కుతాయి. ఆర్మీలో జేసీవో ఉద్యోగాలకు పోటీ పడొచ్చు, ఆన్‌లైనన్ వేదికగా రాణించవచ్చును.
ఉన్నత విద్య : బీఎస్సీ తర్వాత మరింత ప్రావీణ్యం, స్పెషలైజేషన్ కోరుకున్నవారు రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరవచ్చు. అలాగే పలు ఐహెచ్ఎంల్లో ఈ సౌకర్యం ఉంది. కోర్సు అనంతరం వీరు బోధనలో రాణించవచ్చు లేదా ఆతిథ్య రంగంలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశాలు పొందవచ్చు. బీఎస్సీ తర్వాత పీజీ డిప్లమా కోర్సుల్లోనూ చేరవచ్చు, కొన్ని కార్పొరేట్ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగాలన్నీ సాధించవచ్చు. ఐటీసీ, వెల్కమ్ గ్రూపుులు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఆ సంస్థల్లోనే మంచి వేతనం, మంచి హోదాతో తీసుకుంటారు.
కోర్సు : బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషనన్(హెచ్హెచ్ఏ)
అర్హత : ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సు ఉత్తీర్ణత(ఒకేషనల్, ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వాళ్లు అర్హులే)
ద్వితీయ సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు : ఈడబ్ల్యుఎస్ వారికి రూ.700
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకుు రూ.450 ఫీజు
మిగిలిన వారి అందరికీ రూ.1000
ఆన్లైన్ దరఖాస్తు : ఫిబ్రవరి 15 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు
పరీక్ష తేదీ : ఏప్రిల్ 27
ఆ రెండు కోర్సుల్ని ఇక డిస్టెన్స్‌లో చేయడం నిషేధం
112 కేజీలతో ప్రపంచంలోనే అతిపెద్ద 'గోల్డెన్ బర్గర్'- ఏం చేశారో తెలుసా?