తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు మనోబలంతో పని చేస్తే విజయం తథ్యం - శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం - HOROSCOPE TODAY

నవంబర్ 27వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 4:01 AM IST

Horoscope Today November 27th 2024 : నవంబర్ 27వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంత కాలంగా ఇబ్బంది పెట్టిన క్లిష్ట పరిస్థితులు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు గట్టెక్కడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది. వ్యాపారులకు రుణభారం తొలగిపోయి లాభాల పంట పండుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మెరుగైన పనితీరుతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి దేవి ఆరాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీర్తికి భంగం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో సంకట పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు మనో విచారాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆర్థికవృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొందరు బంధువుల కారణంగా కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ సుబ్రబహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలం లేదు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇంటా బయటా ముఖ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశం అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. వ్యాపారంలో పెరిగిన పోటీ కారణంగా నష్టపోతారు. స్థిర సంకల్పంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సంతృప్తినిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. పెద్దల సహకారంతో స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశివారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ ఉత్తమం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. రచయితల రచనా కార్యక్రమాలకీ, సృజనాత్మక, సాహితీపరమైన అన్వేషణలకూ కలిసి వస్తుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సహచరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి కారణంగా కోపం, అసహనంతో ఉంటారు. మనోనిబ్బరంతో ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ వల్ల ఇతరులు బాధపడే అవకాశం వుంది. శని ధ్యానం మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. సౌభాగ్యసిద్ధి ఉంది. నూతన వస్తు, వాహనాలు కొంటారు. ఉద్యోగంలో సందర్భానుసారం నడుచుకుంటే పదోన్నతులు పొందవచ్చు. సంపాదన పెరుగుతుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details