Horoscope Today December 26th, 2024 : డిసెంబర్ 26వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం అండగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో సంతోషకరమైనది. మానసిక ఆనందం కలిగే అనేక సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీ ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి. సన్నిహితులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఆందోళన కలిగించవచ్చు. బంధువుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. కీలక వ్యహారంలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. శివ పంచాక్షరీ మంత్రం జపం శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో రాజీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం మరి కొంతకాలం ఎదురుచూడాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గిట్టని వారు చేసే విమర్శలు పట్టించుకోవద్దు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహాయంతో నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కీలక సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది. సంపద క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా కళ, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. వృత్తిలో మీ నైపుణ్యం మంచి గుర్తింపునిస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సమస్యల పట్ల మౌనంగా, ప్రశాంతంగా ఉండటమే శ్రేయస్కరమని భావిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి పెరగడంతో తీరికలేకుండా ఉంటారు. వినోదం, సరదా కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ప్రార్థన శుభకరం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చిక్కుల్లో పడతారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. శని స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ వాదనలు వద్దు. ప్రశాంతంగా దైవబలం మీద విశ్వాసం ఉంచితే సానుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. ఆంజనేయ దండకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.