తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి నేడు సమయం అనుకూలంగా లేదు- జాగ్రత్తగా ఉండాల్సిందే! - DAILY HOROSCOPE IN TELUGU

అక్టోబర్ 25వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 1:54 AM IST

Horoscope Today 25th October 2024 : 2024 అక్టోబర్ 25వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీ ముక్కుసూటి తత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భావోద్వేగాలను నియంత్రించడం ఈ రోజు సవాలుగా మారుతుంది. మీ ప్రత్యర్ధులు మీ బలహీనతలను అవకాశంగా మలుచుకునే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా అనేక ఆందోళనలు, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. మీ బుద్ధిబలంతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆందోళన తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. వృథా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అందరిని సంతోషపెట్టడానికి అలుపెరగని పోరాటం చేస్తారు. సానుకూల వైఖరితో చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఇష్ట దేవతారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు ఎదురుకావడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి పరంగా ప్రత్యర్ధులు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. తారాబలం బలహీనంగా ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శుభ సమయం నడుస్తోంది. సంపదలు కలుగుతాయి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం కలిసివచ్చి చేపట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఇంట్లో, పనిప్రదేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి పరంగా మీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. న్యాయ సంబంధమైన వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పోరాడి అలిసిపోతారు. మనోబలం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వ్యాపారంలో కూడా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పనుల్లో సానుకూలత లేకపోవడం చికాకు కలిగిస్తుంది. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులు ఉండవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రోజంతా ఊహించని సంఘటనలు, సమస్యలతో నిండిపోయి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడంతో తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో వ్యవహరించేటప్పుడు సహనంగా, లౌక్యంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ధననష్టం సూచితం. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనిస్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు అదృష్టవంతులు అవుతారు. ఈ రోజు ఏ పని చేసినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు సాధిస్తారు. కళాకారులు గత వైభవాన్ని తిరిగి పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయపథంలో పయనిస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. అదృష్టం కలిసివచ్చి ఆదాయం పదింతలు పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందడంతో ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు అన్నివిధాలా శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉన్నందున అన్ని రంగాల వారు వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details