తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అన్నీ ఊహించని విధంగానే!​ ఆదిత్య హృదయ పారాయణం చేస్తే బెటర్!! - DAILY HOROSCOPE IN TELUGU

అక్టోబర్ 24వ తేదీ (గురువారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 2:27 AM IST

Horoscope Today 24th October 2024 : 2024 అక్టోబర్ 24వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో అపజయాలు జరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి మంచికి పొతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఎటు చూసినా సమస్యలే ఉండడటంతో మానసిక ఆందోళనకు గురవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక మనస్థాపం చెందుతారు. మీ తల్లి గారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమాజంలో మీ పరపతికి భంగం కలిగే పనులేవీ చేయకండి. స్థిరాస్తికి సంబంధించిన నిర్ణయాలు, ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలుగా మలచుకొని కెరీర్ లో ముందుకు దూసుకెళ్తారు. ఎదురయ్యే ప్రతి సవాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబ వ్యహారాలు పట్ల సున్నితంగా, ఎమోషనల్ గా ఉంటారు. రచయితలకు శుభ సమయం నడుస్తోంది. సృజనాత్మకతతో రచనలు చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి మందకొడిగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వృద్ధి స్థిరంగా, నిదానంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యమయినా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నవన్నీ సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. విమర్శకుల మాటలకూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. గిట్టని వారి విమర్శలకు అతిగా ప్రతిస్పందించవద్దు. కఠినమైన మాటలతో ఎవరినీ దూషించవద్దు. సన్నిహితులతో వాదనతో కూడిన చర్చలకు దూరంగా ఉండండి. న్యాయ సంబంధ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలను వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. మీ ఖ్యాతి, ప్రజాదరణ నలువైపులా విస్తరిస్తుంది. స్నేహితుల సహాయంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పడుతాయి. లక్ష్మీకటాక్షం ఉండటంతో అన్ని వైపుల నుంచి ధనప్రవాహం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదగడానికి అన్ని విధాలా అనుకూలమైన రోజు. ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం వరించి సంపదలు కలిసి వస్తాయి. కీలకమైన వ్యహారాలు సులభంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తీరికలేని పనులతో సతమతమవుతారు. తగిన విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. మీ హక్కులు సాధించుకోడానికి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివాష్టకం నిత్య పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తీవ్రమైన భావోద్వేగాలతో మానసిక సంఘర్షణకు లోనవుతారు. వృత్తిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారానికి సహచరుల సహాయాన్ని కోరుతారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మీ మనోభీష్టానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతిదానికి సున్నితంగా స్పందించే మీ స్వభావం అవకాశవాదులకు అనుకూలంగా మారే ప్రమాదముంది. మీ విజయానికి మీ స్వభావమే ఆటంకంగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగు వేయడం అవసరం. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముంది. కుటుంబంలో ఘర్షణ పూర్తిగా వాతావరణం ఉంటుంది. సామరస్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. శనిస్తోత్రం పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలవారికి చేపట్టిన పనుల్లో విజయం, కీర్తి, గుర్తింపు ఉండవచ్చు . అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అందరితో సత్సంబంధాలు పెంచుకుంటారు. ఊహించని విధంగా గొప్ప వ్యక్తులతో వ్యాపార పరంగా మంచి డీల్స్ చేసుకునే అవకాశాలు ఎదురవుతాయి. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details