Horoscope Today 23rd September 2024 : 2024 సెప్టెంబర్ 23వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Daily Horoscope In Telugu (ETV Bharat)
Horoscope Today 23rd September 2024 :2024 సెప్టెంబర్ 23వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభసమయం నడుస్తోంది. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వృత్తి వ్యాపారాలలో తిరుగులేని ప్రగతిని సాధిస్తారు. ఉద్యోగులు నూతన టెక్నాలజీతో పనిచేసి శభాష్ అనిపించుకుంటారు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం వరించి ధనవంతులు అవుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి మీరు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే పట్టుదలతో, చిత్తశుద్ధితో పనిచేయాలి. సమయానుకూలంగా నడుచుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం కూడదు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజు చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది. సంపదను వృద్ధి చేసుకోడానికి, నిధులు ఏర్పాటు చేసుకోవడానికి ఇది సరైన సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. దృఢ సంకల్పంతో, కార్యదీక్షతో కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వ పడే స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఆనందంగా ఉంటారు. సమీప బంధువుల నుంచి కానుకలు అందుకుంటారు. ఆర్ధికంగా ఓ మెట్టు పైకి ఎక్కుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. మనోబలంతో, ధైర్యంతో ఉంటే సమస్యలను అధిగమించవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగు వేయాలి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరినీ నమ్మకుండా ఉంటే మంచిది. మితిమీరిన కోపం కారణంగా అనేక అనర్ధాలు జరుగుతాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితులతో మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధిపత్య ధోరణితో వ్యవహరించే వారి విషయంలో సహనంతో ఉంటే మంచిది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. పిత్రార్జితం కలిసి రావడంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన పోటీ కారణంగా భాగస్తుల మధ్య స్పర్ధలు ఏర్పడతాయి. ఈ రోజంతా నిరాశ నిస్పృహలతోనే గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నంలో తీవ్రమైన శ్రమకు గురవుతారు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సున్నితమైన విషయాలకు అతిగా స్పందించవద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదముంది. అవసరానికి ధనం అందుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. సౌందర్య సామాగ్రి కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులు సృజనాత్మకతతో, దృఢ నిశ్చయంతో పనిచేసి విజయాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.