ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈవారం మ్యారేజ్ ఫిక్స్! శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం! - Weekly Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

September 22nd to 28th September 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

September 22nd to 28th September 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారు ఈ వారం శుభకరంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా గొప్ప శుభయోగాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. బుద్ధిబలంతో సమయానుకూలంగా నడుచుకుంటే కార్యసిద్ధి ఉంటుంది. మీ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి లాభాలను అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్థులు సకాలంలో పనులు పూర్తి చేయడానికి అదనపు శ్రమ, కృషి అవసరం. ఒక ప్రణాళిక ప్రకారం సహోద్యోగుల సహకారంతో పనిచేస్తే అన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు వారం ప్రథమార్ధం అనుకూలించక పోయినా ద్వితీయార్ధంలో ఊహించని లాభాలు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు గడప ఎక్కేముందు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్నీ రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉన్నప్పటికినీ సహోద్యోగుల సహకారంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువు నుంచి దృష్టి మరల్చవచ్చు. కమీషన్‌ వ్యాపారులకు, స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండక అశాంతితో ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన పురోగతి ఉండదు. ముఖ్యంగా వ్యాపారులకు గడ్డుకాలం నడుస్తోంది. పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు చేజారిపోవడం వల్ల విచారంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది అందుకే జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్థులకు పనిభారం పెరుగుతుంది. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అభయ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగస్థులకు వారం ప్రారంభంలో చాలా అదృష్టం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉంటాయి. ఉన్నత స్థాయి అధికారులతో పరిచయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. ఎంతో కాలంగా భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు చేయాలనుకునేవారికి ఈ వారం కల నెరవేరుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. బంగారు భవిష్యత్​కు బాటలు వేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సహోద్యోగులతో, సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టం వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వివాదాలకు దారి తీయవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. శివ పంచాక్షరీ జపంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. లక్ష్మీ కటాక్షం ఉంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకు ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరిగినప్పటికీ, ఊహించని లాభాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగులు చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రేయోభిలాషుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. సోమరితనం కారణంగా గొప్ప అవకాశాలను కోల్పోయే ప్రమాదముంది. బద్దకాన్ని వీడి కష్టించి పనిచేస్తే తప్ప వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉండదు. బంధువులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోకపోతే కలహాలు తప్పవు. వృత్తి నిపుణులు స్నేహితుల సహకారంతో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు. అంతర్జాతీయ వ్యాపారంలో వృత్తిని కొనసాగించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సమిష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యర్థులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. దైవబలంతో సమస్యను అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించున్నట్లైతే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్థిక లాభాలను పొందవచ్చు. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి జీతంతో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వర్కింగ్ మహిళలు వృత్తి పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో, సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంకట మోచన హనుమాన్ ఆలయ సందర్శనం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రతిపనిలోను తొందర, పరుగులు ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాధ్యతలు, కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమతోనే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. ఇంటి మరమ్మత్తు పనులకు సంబంధించి అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. ఉద్యోగులపై అకస్మాత్తుగా పనిభారం పెరుగుతుంది. కుటుంబ ఆస్తి వ్యవహారాలు కోర్టులో కాకుండా చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మనోబలం పెరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. సోమరితనం, పనిలో నిర్లక్ష్య వైఖరితో మొదటికే మోసం తెస్తుంది. బద్ధకం వీడితే మంచిది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అవకాశాలు రావాలంటే అణుకువగా ఉండడం అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. లేకుంటే భారీ నష్టాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఆస్తి వివాదాల విషయంలో కోర్టుకు వెళ్లడం కంటే, సామరస్యపూర్వక చర్చల ద్వారా పరిష్కరించడం ఉత్తమం. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా లేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో చోర భయం ఉండవచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. పంచముఖ హనుమ దర్శనంతో ఆపదలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వారం ప్రథమార్ధంలో పట్టుదలతో శ్రమించి తమ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు అప్పగించకుండా పూర్తి చేస్తేనే మంచిది. లేదంటే ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు ఈ వారం ప్రథమార్ధం అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారాలలో తెలివిగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదముంది. ద్వితీయార్ధం శుభప్రదంగా ఉంటుంది. లాభాల పంట పండుతుంది. వ్యాపారాన్ని బ్రహ్మాండంగా విస్తరిస్తారు. సంపద గణనీయంగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు దొరుకుతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.